Advertisement
Google Ads BL

ఇలాంటి ముఖ్యమంత్రిని ఇక చూడలేం!


తెలుగువారి గుండెచప్పుడు తెలుగు వెలుగు నందమూరి తారక రామారావు

Advertisement
CJ Advs

యుగపురుషుడు అంటే ఎలా ఉంటాడో ఎక్కడ వుంటాడో అనుకునేవారికి కళ్ళెదుట దర్శనమిచ్చే ఒకే ఒక రూపం యన్‌.టి.ఆర్‌. జనాలు ప్రేమగా ఎన్టీవోడు అని పిలుచుకునే నందమూరి తారక రామారావు కారణజన్ముడు. మరణమే లేని జననం ఆయనది. తెలుగు సినీ రంగంలో ఆయన పోషించిన విభిన్న పాత్రలు ఇప్పటివరకూ మరెవ్వరూ చెయ్యలేదు. అలాగే ఒకే పాత్రను 18 సార్లు పోషించిన నటులూ ఇప్పటివరకూ లేరు. ఎన్‌.టి.ఆర్‌. నట జీవితంలో శ్రీకృష్ణుడి పాత్రను 18 సార్లు పోషించారు. పౌరాణిక, జానపద, సాంఘిక పాత్రల్లో ఆయనలా మెప్పించిన నటులు అరుదు. పౌరాణికాల్లో కేవలం కృష్ణుడు, రాముడు పాత్రలు మాత్రమే పోషించలేదు. రావణాసురుడు, దుర్యోధనుడి పాత్రలు కూడా పోషించివారిలోని రాజసాన్ని తెలుగు ప్రజలకు చూపించారు. ఆయన నటించిన ఆఖరి చిత్రం ‘మేజర్‌ చంద్రకాంత్‌’. నటుడిగానే మిగిలిపోతే ఇంత చెప్పుకునేవారు కారేమో రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేసి కేవలం 8 నెలల్లో ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి పీఠమెక్కిన మేరునగధీరుడు.

పదవిలో వుండగా ఆయనతో పనిచేసిన ఏ ఐఏఎస్‌ ఆఫీసర్ని ప్రశ్నించినా ఆయనవంటి ముఖ్యమంత్రిని ఇప్పటివరకూ చూడలేదు అనటమే ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఏ నిర్ణయం తీసుకున్నా తీసుకునే ముందు ఆలోచించటమే కాని తీసుకున్న తర్వాత అమలు చెయ్యటమే ఆయన ఆదర్శం. ఎన్నో చిత్రాలు, మరెన్నో పాత్రలు ఇవే కాకుండా రాజకీయాల్లో కూడా ఆయన తీరే వేరు. ఒకానొక సభలో అలనాటి మేటి నటి భానుమతి మాట్లాడుతూ నాకూ, ఎన్‌.టి.ఆర్‌కు లౌక్యం తెలియదు. అందుకే అందరు రాజకీయనాయకుల్లా కాకుండా ఆయన భిన్నంగా వుంటారు అనటం ఈ సమయంలో మనం గుర్తుచేసుకోవలసిన అవసరం వుంది. అటువంటి కారణజన్ముడి జయంతి నాడైనా ఆయన్ని స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.

                                                                                                      - పర్వతనేని రాంబాబు 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs