Advertisement
Google Ads BL

సినీజోష్ ఇంటర్వ్యూ: సోనాల్ చౌహాన్(పండగ చేస్కో)


'రెయిన్ బో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన నటి సోనాల్ చౌహాన్. ఆ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న సోనాల్ 'లెజెండ్' సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆమె నటించిన 'పండగ చేస్కో' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా సోనాల్ చౌహాన్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

Advertisement
CJ Advs

ఈ సినిమా ఎలా ఉండబోతోంది..?

ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్, మ్యూజిక్, యాక్షన్, కామెడీతో కూడిన కుటుంబ కథా చిత్రమిది. మంచి ఎమోషనల్ మసాలా మూవీ ఇది. సినిమా ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుంది.

మీ పాత్ర గురించి..?

ఈ సినిమాలో నేను ఓ ఎన్.ఆర్.ఐ క్యారెక్టర్ లో నటిస్తున్నాను. నా రోల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందరి మీద అధికారం చెలాయిస్తూ, చాలా పొగరుగా ఉండే పాత్రలో కనిపించనున్నాను. ఈ పాత్రలో నటించడం కొంచెం రిస్క్ అనే చెప్పాలి. కాని నా వరకు ఓ నటిగా వెర్సటయిల్ క్యారెక్టర్స్ లోనే నటించాలనుకుంటాను. ఈ సినిమాలో పాత్ర భిన్నంగా ఉండడంతో నటించాను. నటిగా నాకు ఇదొక మంచి అవకాశం.

మీ కో యాక్టర్స్ రామ్, రకుల్ ప్రీత్ సింగ్ గురించి..?

రామ్ ఒక ఎనర్జిటిక్ స్టార్. ట్రెమండస్ యాక్టర్. తన శరీరంలో స్ప్రింగ్స్ ఉన్నట్లుగా డాన్స్ చేస్తాడు. మా కొరియోగ్రాఫర్ హెల్ప్ చేసారు కాబట్టి ఆయనతో డాన్స్ చేయగలిగాను. రామ్ తో వర్క్ చేయడం మంచి ఎక్స్ పీరియన్స్ తన నుంచి చాలా నేర్చుకున్నాను. ఇక రకుల్ విషయానికి వస్తే సినిమాలో నాకు చాలా హెల్ప్ చేసింది. మంచి అమ్మాయి. తను కూడా బొంబాయి నుంచి వచ్చింది సో.. ఇద్దరం సినిమాల గురించి బాగా డిస్కస్ చేసుకునేవాళ్ళం.

దర్శకుడు గోపీచంద్ మలినేనితో వర్క్ చేయడం ఎలా అనిపించింది..?

డైరెక్టర్ గారికి తనకు ఎలాంటి ఎలిమెంట్స్ కావాలో బాగా తెలుసు. క్లాస్ ఆడియన్స్ కు, మాస్ ఆడియన్స్ కు ఎలా చేస్తే సినిమా నచ్చుతుందో, రెండింటిని ఎలా బాలెన్స్ చేయాలో ఆయనకి తెలుసు. సినిమాకి అవసరమైన ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకునేవాళ్ళు. సింగిల్ హ్యాండ్ తో సినిమా మొత్తాన్ని నడిపించారు. అందరిని మేనేజ్ చేస్తూ తనకు కావలసినట్లుగా ఔట్ పుట్ రప్పించుకున్నారు. చాలా ఓర్పు ఉన్న మనిషి. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను.

షూటింగ్ సమయంలో ఏమైనా మరిచిపోలేని అనుభవాలు ఉన్నాయా..?

ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని ఎంత మరచిపోవాలనుకుంటున్నా మర్చిపోలేకపోతున్నాను. పోర్చుగల్ లో అల్గార్ అనే ఓ ప్రాంతం ఉంది. బీచ్, హిల్స్ తో ఉండే ఓ స్టన్నింగ్ లొకేషన్ అది. అక్కడ సాంగ్ షూట్ చేస్తున్నాం. డైరెక్టర్ గారు నన్ను ఓ కొండ మీద నిలబడమన్నారు. వెనక్కి చూస్తే 150 అడుగుల లోతు ఉంది. విపరీతమైన గాలి వీస్తుంది. ఆ టైంలో నేను చచ్చిపోతాననుకున్నాను. ఇంకో షాట్ లో రామ్ అదే ప్లేస్ లో నన్ను తన మీద కూర్చోపెట్టుకొని డాన్స్ చేయాలి. చాలా బయపడ్డాను. అదొక మరచిపోలేని సంఘటన.

ఈ హాట్ సమ్మర్ లో మీ హ్యాంగ్ఔట్ ప్లేస్ ఏంటి..?

నాకు బొంబాయి కన్నా హైదరాబాద్ నచ్చింది. ఇక్కడితో కంపేర్ చేస్తే అక్కడ చాలా వేడిగా ఉంటుంది. ఇక్కడ ఆడియన్స్ కూడా నాకు చాలా నచ్చారు. స్పెషల్ గా నాకు నచ్చే ప్లేసెస్ అనేం లేవు. షూటింగ్ కంప్లీట్ అవ్వగానే నా హోటల్ రూమ్ కి వెళ్ళిపోతాను. అక్కడే రిలాక్స్ అవుతాను.

మీరు ఇండస్ట్రీకి వచ్చి చాలా రోజులయ్యింది. తక్కువ సినిమాలు చేయడానికి కారణాలేంటి..?

నాకు పాత్ర నచ్చితేనే గాని సినిమాలలో నటించలేను. రెయిన్ బో సినిమా తరువాత నాకు ఆఫర్స్ వచ్చాయి కాని అన్ని రొటీన్ గా అనిపించాయి. గ్లామర్ రోల్స్ కన్నా పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తేనే గుర్తింపు వస్తుంది. 

నెక్ట్స్ ప్రాజెక్ట్స్..?

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ 'షేర్' సినిమాకి సైన్ చేసాను. అనుష్క, ఆర్య నటిస్తున్న 'సైజ్ జీరో' చిత్రంలో నటిస్తున్నాను.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs