సినీ హీరోగా.. ఎమ్మెల్యేగా.. క్యాన్సర్ ఆస్పత్రి ఎండీగా బాలకృష్ణ మూడుపాత్రలను విజయవంతంగా పోషిస్తున్నట్లే కనిపిస్తోంది. ఆస్పత్రి బాధ్యతలను సినీయర్ వైద్యులకు అప్పగించిన బాలకృష్ణ.. అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి ఫైళ్లను చెక్ చేసి వస్తుంటారు. ఇక సినిమాల విషయానికొస్తే .. వాటిలో ఆయన నటించక తప్పదు. ఇక్కడ ఎవరి సాయమూ తీసుకోలేని పరిస్థితి. ఇక రాజకీయాలకు సంబంధించి హిందుపూర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన అక్కడి స్థానికులకు అందుబాటులో ఉండేది చాలా తక్కువే. దీంతో స్థానికులు బాలకృష్ణ తమ సమస్యలు పట్టించుకోవడం లేదంటూ పలుమార్లు ఆందోళనకు కూడా దిగారు. దీంతో మేల్కొన్న బాలకృష్ణ హిందుపూర్ ప్రజల సమస్యల పరిష్కారానికి కొత్తదారి వెతికాడు.
సాధారణంగా రాజకీయ నాయకులకు పీఏలో చాలా ముఖ్యమైనవారు. వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా పీఏలే డిసైడ్ చేస్తారు. అయితే బాలకృష్ణ విషయంలో పీఏకు చనువు మరీ ఎక్కువైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హిందుపూర్ ఇన్‌చార్జి ఎమ్మెల్యేగా బాలకృష్ణ పీఏ శేఖర్ వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ నాయకులు ఇక్కడ ఎమ్మెల్యే బాలకృష్ణనో లేక శేఖరో తెలియడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్రతి విషయంలోనూ శేఖర్ ఎక్కువ చేస్తున్నాడని, అనవసరమైన విషయాల్లో తలదూరుస్తున్నాడంటూ వారు విమర్శిస్తున్నారు. మరి ఈ ఆరోపణలు బాలకృష్ణ దాకా వెళ్లాయో లేదో తెలియదు.