Advertisement
Google Ads BL

అంకిత్‌ తివారి ‘లైవ్‌ మ్యూజిక్‌ కాన్‌సర్ట్‌’ హైద్రాబాద్‌లో..!!


హిందీ సినిమా సంగీతంతో పరిచయమున్న తెలుగువారందరికీ సుపరిచితమైన పేరు ‘అంకిత్‌ తివారి’. ‘ఆషికి`2, ఏక్‌ విలన్‌’ వంటి మ్యూజికల్‌ బ్లాక్‌బస్టర్స్‌తో.. హిందీ సినిమా సంగీత ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపేసిన సంగీత ప్రభంజనం అంకిత్‌ తివారి. 

Advertisement
CJ Advs

వర్ధమాన నటీనటులతో రూపొందిన ‘ఆషికి`2, ఏక్‌ విలన్‌’ చిత్రాలు వంద కోట్ల క్లబ్బులో సగర్వంగా స్థానం సంపాదించుకోవడంలో అంకిత్‌ తివారి సంగీతం మరియు అతని గాత్రం అత్యంత కీలక పాత్ర పోషించాయి. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా గతేడాది అంకిత్‌ తివారి ఏకంగా 22 ప్రతిష్టాత్మక అవార్డులు అందుకొన్నాడంటే` దాన్ని బట్టి అతను సృష్టించిన సంచలనం స్థాయిని అర్ధం చేసుకోవచ్చు!

హిందీ సినిమా సంగీత ప్రియుల్ని అంతగా ఉర్రూతలూగిస్తున్న ఈ సంగీత సంచలనం ఈనెల 23, శనివారం సాయంత్రం హైద్రాబాద్‌లో ‘లైవ్‌ పెర్‌ఫార్మెన్స్‌’ ఇస్తున్నాడు. గచ్చిబౌలిలోని ‘బౌల్డర్‌ హిల్స్‌ గోల్ఫ్‌ అండ్‌ కంట్రీ క్లబ్‌’ ఇందుకు వేదిక కానుంది. శనివారం సాయంత్రం 5 గం॥ల నుంచి రాత్రి 10 గం॥ల వరకు.. అయిదు గంటలపాటు అంకిత్‌ తివారి తనదైన శైలిలో జంట నగరాల హిందీ సినిమా సంగీత ప్రియులకు ఓ జీవితకాలం గుర్తుండిపోయే సంగీతానుభూతిని అందించనున్నాడు.

ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని LIVE.IN.MUZIC తో కలిసి ‘ఆర్‌.సి క్రియేషన్స్‌ కంటోనెంట్‌ అండ్‌ క్రియేటివ్‌ హెడ్స్‌ ఈవెంట్స్‌’ ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్వహిస్తోంది!!

ఈ కార్యక్రమం వివరాలు వెల్లడిరచేందుకు హైద్రాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌ ప్రివ్యూ ధియేటర్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కార్యక్రమ నిర్వహకులు ఎస్‌.వి.శ్రీకాంత్‌రెడ్డి, రాకేష్‌చంద్ర గౌరిశెట్టి, హీరో రాజా (‘ఆనంద్‌’ ఫేం), హీరోయిన్స్‌ పూజా రaవేరి, యాంజీ జేమ్స్‌, ‘తులసి గ్రామోద్యోగ సేవాసమితి’ ఫౌండర్‌ ప్రదీప్‌ అగర్వాల్‌, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ పాల్గొన్నారు.

బాలీవుడ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అంకిత్‌ తివారి మొట్టమొదటిసారిగా సౌత్‌ ఇండియాలో ఈనెల 23న ఇస్తున్న లైవ్‌ పెర్ఫామెన్స్‌ గ్రాండ్‌ సక్సెస్‌ కావాలని అతిధులు ఆకాంక్షించగా.. ఈ అరుదైన అవకాశం తమకు లభించడం పట్ల` కార్యక్రమ నిర్వహకులు ఎస్‌.వి.శ్రీకాంత్‌రెడ్డి`రాకేష్‌చంద్ర గౌరిశెట్టి సంతోషం వ్యక్తం చేశారు. 

ఈనెల 23న తాము చేస్తున్న ‘లైవ్‌ మ్యూజిక్‌ కాన్‌సర్ట్‌’ను సక్సెస్‌ చేయాల్సిందిగా అంకిత్‌ తివారి వీడియో సందేశం పంపించారు!!

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs