Advertisement
Google Ads BL

పేదల ఇళ్లకు రామోజీ భూములు పనికిరావా కేసీఆర్‌..!!


'మొండివాడు రాజుకంటే కూడా బలవంతుడు' అనేది సామెత. ఇక రాజే మొండివాడు అయితే పరిస్థితి చెప్పనక్కరలేదు. ఇప్పుడు యూనివర్సిటీ భూములకు సంబంధించి కేసీఆర్‌ వ్యవహారశైలి ఇలాగే ఉందనే విమర్శలు ఉన్నాయి. ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా.. విద్యార్థులు ఆందోళనకు దిగినా.. కేసీఆర్‌ ఏమాత్రం లెక్కచేయడం లేదు. తాను అనుకున్న విధంగా యూనివర్సిటీ భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తానని ఆయన తేల్చిచెబుతున్నారు.

Advertisement
CJ Advs

హైదరాబాద్‌లో ప్రభుత్వ స్థలాలు కరువైన మాట నిజమే. నగరంలోని పేదలకు ఇళ్లు నిర్మించడానికి ఇది పెద్ద ప్రతిబంధకంగా మారింది. అయితే దీనికోసం యూనివర్సిటీ భూములను తీసుకోవాలన్న కేసీఆర్‌ యోచనను విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. యూనివర్సిటీలు శతాబ్దాలపాటు కొనసాగుతాయని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటికి పెద్ద మొత్తంలో భూములన కేటాయిస్తారని చెబుతున్నారు. అంతేకాకుండా ఆహ్లాదకరమైన వాతావరణం, అన్ని సౌకర్యాలుంటేనే విద్యార్థుల మానసిక పరిస్థితి మెరుగ్గా ఉండి విద్యలో రాణించే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.

కేసీఆర్‌ మాత్రం నగరంలో ప్రభుత్వ భూములు లేనందునా పేదలకు ఇళ్ల కోసం యూనివర్సిటీ భూములు తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు. అయితే ఎన్నికలకు ముందు రామోజీ ఫిలిం సిటీని నాగళ్లతో దున్నిస్తానని ప్రతిజ్ఞ చేసిన కేసీఆర్‌.. ఇప్పుడు ఆ భూములను పేదల ఇళ్ల కోసం ఎందుకు తీసుకోవడం లేదంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. అధికారంలోకి రాగానే రామోజీతో చీకటి ఒప్పందం కుదుర్చుకొని ఫిలీంసిటీ భూముల గురించి ఇప్పుడు కేసీఆర్‌ నోరు కూడా ఎందుకు మెదపడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. పేదలపై అంత ప్రేమే ఉంటే ఫిలీంసిటీ భూముల్లోనే ఇళ్లు నిర్మించి ఇవ్వవచ్చుకదా అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా వేలమంది చదువుకునే ఓయూకు 2600 ఎకరాల భూమి అవసరం లేదని చెబుతున్న కేసీఆర్‌ 14 ఎకరాల క్యాంపు ఆఫీసులో ఎందుకు నివసిస్తున్నాడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. నిజాం నవాబు కూడా కేవలం 6 ఎకరాల ప్యాలెస్‌నుంచే పాలన సాగించారని, కేసీఆర్‌ మాత్రం క్యాంప్‌ ఆఫీసు చాలక ఐఏఎస్‌ అధికారుల భవనాన్ని కూడా క్యాంపు ఆఫీసులో కలిపేసుకున్నాడని 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs