Advertisement
Google Ads BL

పవన్‌.. ఈసారి కూడా హ్యాండ్‌ ఇస్తారా..??


పరిణామాలు ఎలా ఉన్నా ఇచ్చిన మాటనుంచి పవన్‌కల్యాణ్‌ వెనక్కి తగ్గారనేది ఆయన అభిమానుల అభిప్రాయం. అయితే గతంలో కూకట్‌పల్లి ఎంపీ స్థానంలో లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్‌నారాయణకు మద్దతు ఇస్తానని పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు. కాని తీరా ఎన్నికలు సమీపించిన తర్వాత పొత్తులో భాగంగా లోక్‌సత్తాకు మద్దతు ఇవ్వలేనని చెబుతూ టీడీపీ తరఫున ప్రచారం చేశారు. ఇక రాజధాని భూ సమీకరణకు సంబంధించి కూడా ఇదే సీన్‌ రిపీట్‌ అవుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement
CJ Advs

భూసమీకరణ చట్టం ఆర్డినెన్స్‌ ద్వారా రాజధానికి భూములు సమీకరించాలని ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. అయితే మొదటినుంచి కూడా భూసేకరణ చట్టాన్ని వినియోగించడానికి తాను వ్యతిరేకమని పవన్‌కల్యాణ్‌ చెబుతూ వస్తున్నారు.  రైతులు ఇష్టపూర్వకంగా భూములు ఇస్తేనే తీసుకోవాలని, బలవంతంగా లాక్కొవద్దంటూ ఆయన చెప్పారు. కాని పవన్‌ మాటలను లెక్కబెట్టని చంద్రబాబు భూసేకరణ చట్టాన్ని వినియోగించింది. దీనిపై తాజాగా పవన్‌కల్యాణ్‌ స్పందించారు. ఏపీ సర్కారు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాని డిమాండ్‌ చేశాడు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటే ఉరుకునేది లేదని హెచ్చరించారు. అయితే పవన్‌ కల్యాణ్‌ ఇలా మాటలతోనే సరిపెడతారా..? లేక భవిష్యత్తులో ఆందోళనకు దిగుతారా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు లోక్‌సత్తాకు హ్యాండ్‌ ఇచ్చిన మాదిరిగానే పొత్తులో భాగమంటూ, రాష్ట్ర అభివృద్ధి కోసమంటూ సర్కారుకే వత్తాసు పలుకుతారన్న వాదనలు కూడా 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs