బాపు చేసినబొమ్మ అనే పదం మనకు తెలిసిందే...బాపు గీసిన బొమ్మ అయినా గీత అయినా అద్భుతంగా ఉంటాయి .. బాపు తీసిన
దృశ్యం గురించి ఇక చెప్పనవసరం లేదు. అయితే బాపు తీసిన సినిమాల్లో నటించే పాత్రధారుల గురించి చెప్పవలసి వస్తే
బాపు ఆలోచనల కు ప్రతిబింబిస్తాయి .. ప్రముఖ బాలివుడ్ నటుడు అనిల్ కపూర్ ను బాపు తొలిసారిగా తెరకు పరిచయంచేసిన విషయం విదితమే .. అతడినే కాదుచాలా మందిని బాపు తెరకు పరిచయం చేశారు.. అలా పరిచయం కాబడ్డ వ్యక్తే సునిల్ కుమార్ .. బాపు భాగవతం లోరాముడిగా ...కృష్ణుడిగా రెండుపాత్రలు పోషించి తరువాత తెలుగులో పలు సినిమాల్లో నటించి ప్రస్తుతం స్టార్ ప్లస్ లో ప్రసారం అవుతున్న తేరేషహర్ మే అనే డైలీసీరియల్ లో దినేష్ చోబే గా కాస్త విలనీ టచ్ ఉన్న పాత్ర పోషిస్తున్నాడు.. కళ్యాణ్ జివెలర్స్ యాడ్ లో తెలుగులో నాగార్జున చేసినపాత్రను హిందీలో అమితాబ్ తో కలిసి చేసిన అనిల్ కుమార్ .. ఇంకా పలు యాడ్ చిత్రాల్లో నటించారు. హైదారాబాద్ లో డిగ్రీ చదువుకున్న ఈ ఉజ్జయినీ యువకుడు తెలుగులో అవకాశం వస్తే విలనీ పాత్రల్లో నటించడానికి ఉవ్విల్లూరుతున్నాడు..
అతని తో చిన్న పాటి మాటా మంతి
మీ నేపధ్యం గురించి చెప్పండి..?
సునీల్ కుమార్ః మాది మధ్యప్రదేశ్‌లోఉండే ఉజ్జయినీ.. అక్కడ ఉండే మహాకాళేశ్వర దేవాలయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు .. మాకు అక్కడ ఒక హోటల్ ఉంది. డిగ్రీ వరకు చదువుకున్నాను.. ఉస్మానియా యూనివర్సిటీలో దూర విద్య ద్వారా డిగ్రీ తీసుకున్నాను అలా నాకు హైదరాబాద్ తో అనుబంధం ఉంది.
నటన లోకి ఎలా వచ్చారు?
సునీల్ కుమార్ః నాకు నటన అంటే ఎంతో ఇష్టం దాంతో నేను ముంబాయి లోని కిషోర్ నమిత్ యాక్టింగ్ స్కూల్లో యాక్టింగ్ కోర్స్ చేశాను... అక్కడ యాక్టింగ్ స్కూల్లో రుతిక్ రోషన్ నా క్లాస్ మేట్ .అక్కడికి ఎలా వెళ్ళ గలిగాను అంటే స్టార్ డమ్ పత్రిక వారు నిర్వహించిన టాలెంట్ హంట్ లో సెలక్ట్ అయ్యాను... వారు స్పాన్స్ ర్ షిప్ లో ఆ ఇనిస్టిట్యూట్ లో చదువుకున్నాను.. అక్కడ కోర్సు కాగానే రాజస్థానీ భాషలో రెండు సినిమాల్లో హీరోగా చేశాను..
మరి తెలుగులోకి ఎలా వచ్చారు?
సునిల్ కుమార్ః బాపు గారి దర్శకత్వంలో ఉషాకిరణ్ ఫిలింస్ వారు రూపొందించిన భాగవతం సీరియల్ లో రాముడి పాత్ర కోసం వాళ్ళు వెతుకుతున్న సమయంలో వాళ్ళు ఆడిషన్స్ చేసినప్పుడు ఒక్కరు కూడా బాపు గారికి నచ్చలేదట... ఆ ప్రయత్నంలో భాగంగా రాజశ్రీ ఫిలింస్ వారు బాపుగారికి నేను నటించిన రాజస్థాని సినిమాలను చూపించగానే బాపు గారునన్ను ఎన్నుకున్నారు.. అలా నేను బాపు గారి ద్వారా భాగవతం లో రాముడి గా కృష్ణుడిగా రెండు పాత్రలు పోషించే అవ కాశం వచ్చింది. అదే నా కెరియర్ కు బ్రేక్ తెచ్చింది దాని తరువాత బాపుగారి దర్శకత్వంలోనే సుందరకాండ.. రాధాగోపాళం లలోచేశాను. దాని తరువాత అల్లాణి శ్రీదర్ గారి దర్శకత్వంలో థదాగధ బుద్ద సినిమాలో తులసీదాస్ , జైబాలాజీ సినిమాల్లో పలు పాత్రలు చేశాను. కె.రాఘవేంద్రరావు గారి గోదాకళ్యాణం సీరియల్ కూడా చేశాను.
ప్రస్తుతం ఏమి చేస్తున్నారు?
సునిల్ కుమార్ః హిందీలో స్టార్ ప్లస్ లో ప్రసారం అవుతున్న తేరేషహర్ మే అనే సీరియల్ లో హీరోయిన్ గౌతమి కపూర్ సోదరుడిగా కాస్త విలనీ లక్షణాలు ఉన్న పాత్రలో చేస్తున్నాను..ఆ సీరియల్ ను జనం చాలా బాగా ఆదరిస్తున్నారు.
ఇవి కాకుండా ఇంకా ఏమైనా చేశారా?
సునిల్ కుమార్ః కమర్షియల్ యాడ్ పిలింస్ లో చేశాను కళ్యాణి జివెలర్స్ హిందీ వెర్షన్ లో తెలుగులో నాగార్జున చేసిన పాత్రను అమితాబ్ తో కలిసి చేశాను.. అవి కాకుండా వాసన్ ఐకేర్ .హెచ్.యస్.బీసి తో పాటు ఒక ట్రాక్టర్ కంపెనీ యాడ్ లోనూ చేశాను... కమర్షియల్ యాడ్ పిలింస్ లోచేశాను కాని కమర్షియల్ చిత్రాల్లో చేసే అవకాశం నాకు ఇంకా రాలేదు.
ఆ వైపుగా ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా?
సునిల్ కుమార్ః ప్రస్తుతం అదే ప్రయత్నంలో ఉన్నాను.. అందులో భాగంగా పూరి జగన్నాధ్ గారిని రెండుసార్లు కలిశాను.. ఆయన సానుకూలంగా స్పందించారు.. ఏదో ఒక సినిమాలో తప్పకుండా అవకాశం ఇస్తాడనే నమ్మకంతో ఉన్నాను.
తెలుగులో ఎలాంటి పాత్రల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు?
సునిల్ కుమార్ః తెలుగులో నాకు ప్రకాష్ రాజ్ పోషిస్తున్న తరహా పాత్రలు అంటే ఇష్టం ప్రకాష్ రాజ్ అన్నా కూడా ఇష్టమే..విలనీ పాత్రల కోసం ప్రయత్నం చేస్తున్నాను ..నా లోని నటుడిని బాపు గారు గుర్తించారు.. ఆయన ఆశీస్సులు నామీద ఎప్పుడూ ఉంటాయి కాబట్టి నాకు తెలుగులో తప్పకుండా మంచి అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను. నా టాలెంట్ కు తగ్గ వేషాలు ఇస్తే నటుడిగా వాటికి అన్ని విధాలా తప్పకుండా న్యాయం చేయగలను.
సరే మీకుతప్పకుండా ఆ అవకాశం రావాలని కోరుకుంటున్నాము.. బెస్ట్ ఆఫ్ లక్
Advertisement
CJ Advs