Advertisement
Google Ads BL

సినీజోష్ ఇంటర్వ్యూ: నందిని (మోసగాళ్ళకు మోసగాడు)


సుధీర్‌బాబు, నందిని జంటగా నటిస్తున్న చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. లక్ష్మీనరసింహా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బోస్ నెల్లూరి దర్శకుడు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ నెల 22న సినిమాను ప్రక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. ఈ సందర్భంగా హీరోయిన్ నందిని తో సినీజోష్ ఇంటర్వ్యూ..

Advertisement
CJ Advs

సినిమా ఎలా ఉండబోతోంది..?

క్రైమ్, కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. ఈ చిత్రంలో కథ, కథనాలతో పాటు సుధీర్‌బాబు పాత్ర చిత్రణ కొత్తపంథాలో సాగుతాయి. పూర్తి కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇంటిల్లిపాదిని అలరిస్తుంది. సినిమాలో ప్రతి సన్నివేశం ప్రేక్షకులను నవ్విస్తుంది. సుధీర్ బాబు డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తారు. సినిమా ఆడియోకి, ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందనుకుంటున్నాను.

ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది..?

తెలుగులో ఇది నా రెండవ సినిమా. మొదట నీలకంట గారు చేసిన 'మాయ' అనే చిత్రంలో హీరోయిన్ గా చేసాను. అయితే 'మోసగాళ్ళకు మోసగాడు' సినిమా ఆడిషన్స్ అవుతున్నాయని తెలిసి అక్కడకి వెళ్లాను. నేను నచ్చడంతో ఓకే చేసారు.

మీ పాత్ర గురించి..?

ఈ సినిమాలో నేను జానకి అనే ఓ బ్రాహ్మణ అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. చాలా ముద్దుగా, అమాయకంగా ఉండే రోల్ అది. రెగ్యులర్ సినిమాలో హీరోయిన్ లా కేవలం పాటలు, కొన్ని సన్నివేశాల కోసమే కాకుండా నా పాత్రకు ఇంపార్టన్స్ ఉంటుంది. 

మీ కో యాక్టర్, డైరెక్టర్ గురించి..?

నా కో యాక్టర్ సుధీర్ బాబు చాలా ప్యాషనేట్, డెడికేషన్ ఉన్న మనిషి. నటన పై తనకు చాలా ఆసక్తి ఉంది. డైరెక్టర్ బోస్ గారు ప్రతి షాట్ చాలా ఓపికగా తీస్తారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ప్రొడ్యూసర్స్ ఎక్కడా కాంప్రమైస్ అవ్వకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

సినిమాలలోకి రావడానికి ఎవరి ఇన్స్పిరేషన్ అయినా ఉందా..?

నేను ఎమ్.బి.ఏ చేసాను. చిన్నప్పుడు మా స్కూల్ ఓ ఈవెంట్ కోసం సౌందర్య గారు వచ్చారు. ఆవిడను చూసి ఎలా అయినా హీరోయిన్ అవ్వాలనుకున్నాను. అప్పటినుండి మోడలింగ్ చేయడం మొదలు పెట్టాను. ఇంట్లో వాళ్ళు కూడా ప్రోత్సహించారు. రామానంద్ గారి దగ్గర నటనలో శిక్షణ పొందాను. 2010 లో మిస్ ఆంధ్రప్రదేశ్ గా, 2011 మిస్ ప్రెట్టి ఐస్ గా సెలెక్ట్ అయ్యాను. తెలుగు లో మాయ, కన్నడలో గుండెజారి గల్లంతయ్యిందే సినిమా రీమేక్, తమిళంలో ఓ సినిమా చేసే సినిమా అవకాశాలు వచ్చాయి. ఒకవేళ అవకాశాలు రాకపోతే నా చదువు కి సంబంధించిన వృత్తిలో స్థిరపడదాం అనుకున్నాను.

ఏ ఇండస్ట్రీలో పని చేయడానికి ఇష్టపడతారు..?

నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్ లోనే. భాష సమస్య కూడా లేదు. అందుకే తెలుగు సినిమాలలో కనిపించడానికే ఇష్టపడతాను. ఇప్పుడిప్పుడే తమిల్ నేర్చుకుంటున్నాను.

ఎలాంటి పాత్రల్లో నటించడానికి ఇష్టపడతారు..?

'మోసగాళ్ళకు మోసగాడు' సినిమా చుసిన తరువాత నందిని నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలోనే నటించిందని అందరు అంటారు. ఎక్కువగా పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్స్ లో కనిపించడానికి ఇష్టపడతాను. నా దృష్టిలో గ్లామర్ అనేది ముఖంలో, ఎక్స్ ప్రెషన్స్ లో ఉంటుంది. బట్టలలో కాదు.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

తమిళంలో పి.వి.పి బ్యానర్ లో 'గ్రహణం' అనే సినిమాలో నటిస్తున్నాను. గ్లామరస్ రోల్ అది. తమిళంలో మరో రెండు, మూడు సినిమాలు ఆఫర్స్ లో ఉన్నాయి.   

 

 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs