Advertisement

'డ్రాగన్‌ అండ్‌ ది డేర్‌ డెవిల్‌' ఛంఘిజ్‌ ఖాన్‌ మోదీ!


భారత ఉపఖండాన్ని భూకంపాలు వణికిస్తున్నాయి. అంతకుమించి పొరుగునున్న చైనా డ్రాగన్‌ ప్రపంచాధిపత్యానికి అన్ని రంగాలలో దూసుకుపోతూ చెమటలు పట్టిస్తోంది.. భారత్‌కి పొరుగునున్న పాక్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, మయన్మార్‌ దేశాలలో స్ధావరాలు ఏర్పరుస్తోంది. ఒకప్పటి సిల్కురూట్‌ని పునరుద్ధరించడంతోపాటు సిల్కు సాగర మార్గాన్ని ఏర్పాటు చేస్తోంది. అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ ప్రపంచ బ్యాంకుకి ప్రత్యామ్నాయంగా ‘బ్రిక్‌। అభివృద్ధి బ్యాంకుని ఏర్పాటు చేసింది. ఆసియా ` పసిఫిక్‌ ప్రాంతంలో ప్రమాదకరంగా విస్తరిస్తున్న చైనా భారత్‌ని అన్ని రకాలుగా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉక్కు పిడికిలి బిగించి డ్రాగన్‌ పీచమణచడానికి గోదాలోకి దిగిన మోదీ ముందస్తు చర్యగా రష్యా, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా దేశాలతో జతకట్టారు.
సరిహద్దు వెంబడి చైనా మిలట్రీ కవ్వింపు చర్యలకు ధీటుగా జవాబిచ్చే స్వేచ్ఛను క్షేత్రస్థాయి కమాండర్లకిచ్చారు. సరిహద్దు వివాదాన్ని ముందు తరాలకి వారసత్వ సంపదగా ఇవ్వక, చైనా అధినాయకత్వంతో సత్వర పరిష్కార మార్గాలు వెదుకుతున్నారు. చైనాతో ఆర్ధిక, సాంకేతిక, వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నారు. అంతర్గతంగా ఎన్డీఏ ప్రభుత్వం పెనుసవాళ్ళని ఎదుర్కొంటున్నా, భూసేకరణ బిల్లు రాజ్యసభ గడపదాటే పరిస్ధితి కనిపించకున్నా గత భారత ప్రధానులకన్నా భిన్నంగా, విలక్షణంగా, బలంగా దూసుకుపోతున్నారు మోదీ. బీజింగ్‌లో బహిరంగ సభ పెట్టి తన వాక్చతురతని, సమ్మోహన శక్తిని ప్రదర్శించనున్నారు. చైనాతోపాటు దక్షిణ కొరియా మంగోలియాలోనూ పర్యటించనున్న మోదీని చూస్తుంటే మంగోలియన్‌ మహావీరుడు ఛంఘిజ్‌ఖాన్‌ స్ఫురణకొస్తున్నాడు.

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement