Advertisement
Google Ads BL

తెలుగు & తమిళ ఫిలిం స్టార్ క్రికెట్..!


తెలుగు ఫిలిం ఇండస్ట్రీను మెరుగుపరచాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ సి.ఎమ్.రిలీఫ్ ఫండ్ కింద జూన్ 21, 2015 న ఎల్.బి.స్టేడియం లో తెలుగు మరియు తమిళ హీరోలతో స్టార్ క్రికెట్ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ "తెలంగాణా ముఖ్యమంత్రి కె.సి.ఆర్ 2000 ఎకరాలలో ఫిలిం స్టూడియోను నిర్మించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు సహకారంగా ఉండాలని తెలుగు మరియు తమిళ హీరోలతో ఓ క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదులుగా చిరంజీవి గారిని, మహేష్ బాబు గారిని ఆహ్వానించాం. తెలుగు హీరోలకు కెప్టెన్ గా వెంకటేష్ గారు, తమిళ హీరోలకు కెప్టెన్ గా జీవా గారు బాధ్యతలు నిర్వర్తిస్తారు. అలాగే తెలుగు హీరోలకు లీడ్ గా శ్రీకాంత్ గారు, తమిళ హీరోలకు లీడ్ గా విశాల్ గారు ఉండనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బును సి.ఎమ్. రిలీఫ్ ఫండ్ కు ఇవ్వనున్నాం. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయప్రధం చేయాలని కోరుకుంటున్నా" అని చెప్పారు.

Advertisement
CJ Advs

చాముండేశ్వరినాథ్ మాట్లాడుతూ "తెలంగాణా రాష్ట్రంలో సంక్షేమ పథకాల కోసం జూన్ 21 న ఎల్.బి.స్టేడియం లో తెలుగు హీరోలకు, చెన్నై హీరోలకు మధ్య క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది" అని చెప్పారు.

కొత్త ప్రభాకర్ రెడ్డి(మెదక్ ఎమ్.పి) మాట్లాడుతూ "తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించాక అన్ని పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా సినిమా ఇండస్ట్రీను డెవలప్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి కె.సి.ఆర్. చేతుల మీదుగా ఈ కార్యక్రమం మొదలుకానుంది. ఈ క్రికెట్ మ్యాచ్ ద్వారా కనీసం 10 కోట్ల రూపాయలను ఇండస్ట్రీ మెరుగు కోసం కలెక్ట్ చేయాలని భావిస్తున్నాం" అని చెప్పారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ "తెలుగు ఇండస్ట్రీలో చాలా చారిటి మ్యాచ్ లు నిర్వహించాం. హుదుద్ బాధితుల కోసం కూడా ఎన్నో కార్యక్రమాలు చేసాం. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత చేస్తున్న మొదటి క్రికెట్ మ్యాచ్ ఇది. ఈ కార్యక్రమం ద్వారా సి.ఎమ్.రిలీఫ్ ఫండ్ కోసం మా వంతు సహకారం అందించనున్నాం" అని చెప్పారు.

కాదంబరి కిరణ్ మాట్లాడుతూ "ఇదొక గొప్ప కార్యక్రమం. అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. కె.సి.ఆర్. గారు హైదరాబాద్ సిటీ ను సిటీ హబ్ గా మారుస్తానని చెప్పారు. ఆయన బాటలో నడవడం మన బాధ్యత" అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న చింతల నాగరాజు సి.ఎమ్.రిలీఫ్ ఫండ్ కు లక్ష రూపాయలు డొనేట్ చేసారు.

ఇంకా ఈ కార్యక్రమంలో హీరో తరుణ్, సుమన్, ఆకాష్, రాజ్ టాకూర్, ఆలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs