Advertisement

‘‘రుద్రమదేవి’’ని తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహమేది..?


తెలంగాణ సినిమా ` కాకతీయ వైభవాన్ని కళ్ళకు కట్టే సినిమా - అచ్చ తెనుగు సినిమాకి నిలువుటద్దం రాణీ ‘రుద్రమదేవి’. గుణశేఖర్‌ వంటి సామాన్య దర్శక నిర్మాత చేసిన గొప్ప సాహసం రుద్రమదేవి నిర్మాణం. స్వర్గీయ దర్శక నిర్మాత టి.క్రాంటికుమార్‌ ‘గోన గన్నారెడ్డి’ చిత్రాన్ని కృష్ణంరాజుతో తీయాలని విశ్వప్రయత్నం చేశారు. క్రాంతి కుమార్‌తో అనుబంధమున్న గుణశేఖర్‌కీ ఆ ప్రాజెక్టులో ప్రవేశం వుంది. అందుకే అల్లు అర్జున్‌ని ఆ ప్రత్యేక పాత్రకి ఎంపికచేశారు. అనుష్క, రానా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఆడియో విడుదల వరంగల్‌లో అమోఘంగా జరిగింది. భారీ వ్యయంతో నిర్మించే ఏ చిత్రంపైనైనా మొత్తం పెట్టబడి నిర్మాతదికాదు. ఫైనాన్షియర్స్‌, డిస్ట్రిబ్యూటర్స్‌, బయ్యర్స్‌, ఎగ్జిబిటార్స్‌ - తలాకొంత పెట్టుబడి పెడతారు. సినిమా జయాపజయాలతో ప్రమేయంలేకుండా సకాలంలో విడుదలయితే ఆ సినిమా నిర్మాతకి, సినిమా పరిశ్రమకి పెద్దగా నష్టం వుండదు. కానీ విడుదల తేదీ మారితే థియేటర్ల యజమానులు, కొనుగోలుదార్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్స్‌ అందరూ నష్టపోతారు. అందుకు గొప్ప ఉదాహరణ కమలహాసన్‌ ‘ఉత్తమ విలన్‌’. సినిమా విడుదలలో జాప్యం జరిగితే పబ్లిసిటీ, ఆఫీసు మెయింటెనెన్స్‌, ఫైనాన్షియర్స్‌ కమిట్‌మెంట్‌ అన్నీ పెరుగుతాయి. ఫిలిమ్‌ ఇండస్ట్రీలో మనీ రొటేషన్‌ ఆగిపోతుంది. వాస్తవానికి రుద్రమదేవి సినిమాని తెలంగాణ ప్రభుత్వం ప్రమోట్‌ చేయాలి. ‘మిషన్‌ కాకతీయ’ పేరిట కాకతీయ ప్రభువులు ఇరిగేషన్‌ పట్ల ఎంత శ్రద్ధ చూపారో అంత శ్రద్ధ చూపుతోంది కెసిఆర్‌ ప్రభుత్వం, చెరువుల మరమ్మత్తులు చేపట్టి. నేటివిటీవున్న ఇటువంటి చారిత్రక సినిమాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్ధిక పురస్కారం అందజేయాలి, పన్నులలో మినహాయింపు కల్పించాలి, ప్రతి విద్యాలయంలో ఈ సినిమాని ప్రదర్శించడానికి వీలుగా హక్కులు పొందాలి. 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement