Advertisement

జయలలిత కర్ణుడు, ద్రౌపది, కోకిలాబెన్‌..!


‘‘ఆదాయానికి మించి ఆస్తులు’’ కేసు తమిళ రాజకీయాలనేకాదు జాతీయ రాజకీయాలనూ కుదిపేసింది. భారతంలో కర్ణుడు, తమిళనాడులో జయలలిత మాత్రమే బడుగుల సంక్షేమానికి ఉదారంగా వ్యవహరించారు. వారి ధాతృత్వం అంతటిది. జయలలితకు జైలు శిక్ష పడినప్పుడు ఆమె ప్రత్యర్ధులు సయితం ‘అయ్యో...’ అనుకున్నారు. తమిళ సినిమా పరిశ్రమ యావత్తు ఆమెకు బాసటగా నిలిచింది. భరతుడు రాముని పాదుకల సాక్షిగా రాజ్యాన్ని పాలించినట్టు తమిళనాడులో ఆమె పేరిట పాలన సాగింది, ఆమె ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలు కొనసాగాయి. జీవితంలో ఆమె ఎదుర్కొన్న గడ్డు సమస్యలు ఒక్క ద్రౌపది ` భారతంలో మాత్రమే ఎదుర్కొన్నది. భర్తను కోల్పోయిన రిలయెన్స్‌ అధినేత్రి కోకిలాబెన్‌ తన కుమారులిద్దర్నీ సముదాయించిన వైనం జయలలితలోనూ కనిపిస్తుంది, రాజకీయ నిర్ణయాలలో. జయలలిత జీవితం, ప్రతికూల పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకున్న వైనం బిజినెస్‌ గురూలకి ఆదర్శం, ఆమె జీవితం అధ్యయనీయం, ఆమె ఆలోచనలు అనుసరణీయం. శుభం భుయాత్‌!

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement