Advertisement
Google Ads BL

లారెన్స్‌ కి అతి ఎక్కువైంది!


సినిమా ఫీల్డ్‌లోని అందరితో ఓ డ్యాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా రాఘవలారెన్స్‌కు మంచి పరిచయాలు ఉన్నాయి. సాధారణంగా లారెన్స్‌ వంటి ముఖపరిచయం ఉన్న వారు వచ్చి మీతో ఓ సినిమా చేయాలని ఉంది.. అని అంటే మన హీరోలు కూడా కాదనకుండా చూద్దాంలే... చేద్దాంలే... అంటూ ఉంటారు. అంతేగానీ సినిమా చేయమని ఖరాఖండీగా చెప్పరు. అలాగని చేయరు. ఇదో రకం పబ్లిసిటీ. ప్రస్తుతం అలాంటి పబ్లిసిటీనే లారెన్స్‌ తన ఇమేజ్‌ను పెంచుకోవడానికి అందరు స్టార్‌ హీరోలను వాడుకొంటున్నాడు. గతంలో తేజ, ఎన్‌.శంకర్‌ వంటి దర్శకులు కమల్‌హాసన్‌తో, రజనీకాంత్‌తో సినిమాలు చేస్తామని చెప్పి తెగ నవ్వుతెప్పించారు. లారెన్స్‌ ఇప్పుడు చేస్తోంది కూడా అదే పని. 

Advertisement
CJ Advs

ఆయన మాట్లాడుతూ... పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌తో స్క్రిప్క్‌వర్క్‌లో ఉన్నాను. ఒకసారి ఓకే అయిన తర్వాత మిగతా విషయాలు చెబుతాను.. అంటున్నాడు. అంతేగాక సౌతిండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూడా ఈ ‘గంగ’ సినిమా చూశాడు. అద్బుతం అని పొగుడుతూ.. ఇన్ని రకాల గెటప్స్‌ నీ ఒక్కడికే ఎలా సూట్‌ అవుతున్నాయి? అని ఆశ్చర్యపడి మంచి కథతో వస్తే ఇద్దరం కలిసి పనిచేద్దాం అన్నాడట. ఇది కూడా లారెన్సే చెప్పుకొచ్చాడు.  ఇక నాగార్జునతో ‘మాస్‌, డాన్‌’ చిత్రాల తర్వాత మరో చిత్రం చేయడానికి రెడీగా ఉన్నానని, ‘కాంచన’ సినిమా స్టోరీని ఆయనకు చెబితే చీర కట్టుకోవాలి.. బొట్టు పెట్టుకోవాలి.. అంటున్నావు... అయినా ఆ  పాత్ర నువ్వు చేస్తేనే బాగుంటుందని సమాధానం ఇచ్చాడట. త్వరలో ఆయనతో కూడా సినిమా చేస్తాడట. 

ఇక చిరంజీవి నటించే 150వ చిత్రానికి కూడా తానే కొరియోగ్రాఫర్‌గా పనిచేయనున్నానంటూ తెగ మాటలు చెప్పేస్తున్నాడు. ఇలా ఉన్నవి లేనివి చెబితే గానీ తన సినిమాకు మరింత క్రేజ్‌ రాదనేది వాస్తవమే అయినా మరీ ఇంత ఓవర్‌గా అందరు హీరోలు నాతో సినిమాలు చేస్తామని వెంటపడుతున్నారు అనే తాపత్రయంతో మాట్లాడుతున్న లారెన్స్‌ వ్యాఖ్యలను చూసి ఇండస్ట్రీ జనాలు నవ్వుకొంటున్నారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs