అందం, గ్లామర్, స్కిన్‌షోలు మాత్రమే మెయిన్‌టెయిన్ చేస్తూ అవకాశాలు సంపాదించుకునే హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. మన ప్రేక్షకులు కూడా హీరోయిన్ అంటే దేవకన్యలా, అప్సరసల్లా ఉండాలి... అనే అభిప్రాయమే వెలిబుచ్చుతున్నారు. కానీ నేటి తరానికి చెందిన కొందరు హీరోయిన్లు మాత్రం అటు గ్లామర్ రోల్స్ చేస్తూనే అవకాశం వచ్చినప్పుడు తమ నటనా ప్రతిభ చూపించే పాత్రలు వస్తే డీగ్లామర్ రోల్స్ చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఎన్నో చిత్రాల్లో తన అందంతో అందరినీ మాయ చేసిన అనుష్క మధ్య మధ్యలో ‘అరుంధతి, పంచాక్షరి, వర్ణ’ వంటి చిత్రాల్లో కూడా నటించి తన సత్తా ఏమిటో చాటింది.
ప్రస్తుతం ఆమె ‘బాహుబలి’ చిత్రంలో ప్రభాస్‌కు భార్యగా, మరో ప్రభాస్‌కు తల్లిగా నటిస్తోంది. చిరిగిన జాకెట్, చేతిలో గొలుసులతో బంది చేయబడిన ఆమె లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. అదే సమయంలో ‘సైజ్ జీరో’ చిత్రంలో ఒబేసిటీతో బాదపడే యువతిగా నటిస్తోంది.
ఇక తన కెరీర్ మొదటి నుండి నటనాపరమైన పాత్రలనే ఎంచుకుంటున్న నిత్యామీనన్ ‘గంగ’ చిత్రంలో డీగ్లామర్ రోల్‌లో అద్భుతంగా నటించి కనిపించింది. ఇక ఇందులో నటించిన మరో హీరోయిన్ తాప్సి కూడా గ్లామర్‌తోపాటు దెయ్యంగా డీగ్లామర్ రోల్ చేసి మెప్పించింది.
ఇక విక్రమ్ హీరోగా తమిళంలో విజయ్‌మిల్టన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘10ఎంద్రాకుల్లా’ చిత్రంలో హీరోయిన్ సమంత రెండు పాత్రలు చేస్తోంది. అందులో ఒక పాత్ర పూర్తిగా డీగ్లామర్ రోల్ అని సమాచారం. వీరితో పాటు లక్ష్మీమీనన్ వంటి హీరోయిన్లు కూడా డీగ్లామర్‌రోల్స్‌లో నటించడానికి సై అంటూ ముందుకు సాగుతున్నారు.