Advertisement
Google Ads BL

త్రిష పెళ్లి చెడ‌గొట్టిన పెద్ద‌లెవ‌రు?


క‌థానాయిక త్రిష పెళ్లి గురించి చ‌ర్చ ఆగ‌డం లేదు. వ‌రుణ్ మ‌ణియ‌న్‌తో జ‌రిగిన నిశ్చితార్థం ర‌ద్ద‌యింద‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. అయితే ఆ విష‌యం గురించి అటు త్రిష కానీ, ఇటు వ‌రుణ్ కానీ నోరు విప్ప‌డం లేదు. కానీ ఇద్ద‌రి మ‌ధ్య చెడింద‌న్న విష‌యం మాత్రం స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. అయితే తాజాగా ఆ విష‌యం గురించి  చెన్నైలో త్రిష త‌ల్లి స్పందించిన‌ట్టు తెలుస్తోంది.
త్రిష సినిమాల్లో న‌టించ‌డం వ‌రుణ్‌కి ఇష్టం లేక‌పోవ‌డంతోనే పెళ్లి రద్దయింద‌ట క‌దా అని ఆమెని అడిగితే... అలాంటిదేమీ లేద‌ని చెప్పుకొచ్చింద‌ట‌. త్రిష సినిమాల్లో న‌టించడం వ‌రుణ్‌కికానీ, ఆయ‌న కుటుంబ‌స‌భ్యులకి కానీ ఏ మాత్రం అభ్యంత‌రం లేద‌నీ ఈ పెళ్లి చెడిపోవ‌డానికి కార‌ణం కొంత‌మంది పెద్ద‌ల‌నీ ఆమె స్ప‌ష్టం చేసిన‌ట్టు స‌మాచారం. అయితే ఆ పెద్ద‌లు ఎవ‌ర‌న్న‌ది మాత్రం బ‌య‌ట‌పెట్ట‌లేద‌ట‌. సినిమా పరిశ్ర‌మ‌కు చెందిన పెద్ద‌లా లేదంటే వ‌రుణ్ కుటుంబానికి సంబంధించిన పెద్ద‌లా అన్న విష‌యం గురించి క్లారిటీ ఇవ్వ‌లేద‌ట‌. ఇంత‌కీ ఆ పెద్ద‌లు ఎవ‌రై ఉంటార‌న్న విష‌యం గురించి ఇప్పుడు చ‌ర్చ సాగుతోంది. మ‌రి ఆ విష‌యం గురించి త్రిష ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs