Advertisement
Google Ads BL

ఆ ఇద్దరు మంత్రులకు పెద్ద రిలీఫ్‌ దొరికింది..!!


ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు స్థానాలకు, తెలంగాణలో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 21 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు విధించారు. అనంతరం జూన్‌ 1న ఎన్నికలు జరుగుతాయి. అదేరోజు సాయంత్రం ఫలితాలు విడుదలవుతాయి.

Advertisement
CJ Advs

ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ తెలంగాణలో పలువురు మంత్రులకు రిలీఫ్‌నిచ్చింది. మంత్రుల తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరిలు ఏ చట్టసభకు కూడా ప్రాతినిధ్యం వహించడం లేదు. ఆరు నెలల్లోగా వీరు చట్టసభకు ఎన్నికకాపోతే మంత్రులుగా కొనసాగడానికి వీలులేదు. వీరిద్దరు చాన్నాళ్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. ఈతరుణంలో వచ్చిన ఎన్నికల నోటిఫికేషన్‌ వీరికి పెద్ద ఊరటనిచ్చింది. తెలంగాణలోని ఆరు సీట్లలో టీఆర్‌ఎస్‌ రెండు స్థానాలు వీరిద్దరికీ కేటాయించండం తప్పనిసరిగా మారింది. ఇక మిగిలిన నాలుగు స్థానాల కోసం కూడా పోటీ తీవ్రంగా ఉంది. మరి ఇరు రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకపక్షమవుతాయా..? లేక రసవత్తరమైన పోటీ ఉంటుందా అనేది వేచి చూడాలి.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs