Advertisement
Google Ads BL

సినీజోష్ ఇంటర్వ్యూ: రామ్ గోపాల్ వర్మ


సౌండ్, లైటింగ్, ఎఫెక్ట్స్ ఇలా అన్ని విషయాలలో సినిమాను వరల్డ్ రేంజ్ లో తీసుకువెళ్ళిన బ్రిలియంట్ టెక్నీషియన్ రామ్ గోపాల్ వర్మ. క్రైమ్, హారర్, థ్రిల్లర్ వంటి జోనర్స్ లో మాత్రమే చిత్రాలను తెరకెక్కించే వర్మ ఇప్పుడు కొత్తగా రొమాన్స్ జోనర్ లో '365 డేస్' అనే చిత్రాన్ని ప్రేక్షకులకు అందివ్వనున్నారు. నందు, అనైక సోఠి జంటగా నటించిన ఈ చిత్రం మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో సినీజోష్ ఇంటర్వ్యూ..

Advertisement
CJ Advs

సినిమా ఎలా ఉండబోతోంది..?

పెళ్లితో ఇద్దరు మనుషులు ఎక్కువ కాలం కలిసి ఉండలేరని నా అభిప్రాయం. పెళ్ళైన కొన్ని రోజులకు ఇద్దరి మధ్య ఖచ్చితంగా కొత్త గ్యాప్ వస్తుంది. అది బ్రేకప్ అవ్వడానికి దారి తీస్తుంది. దానికి గల కారణాలు సిల్లీ గా అనిపించినా అదే నిజం. మా '365 డేస్' లో కూడా అదే చూపించాం. ఎంతో గాడంగా ప్రేమించుకున్న ఇద్దరు వ్యక్తులు పెళ్ళైన తరువాత వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. వారి మధ్య ఎమోషనల్ జర్నీను ఈ చిత్రం లో చూపించాను.

'365 డేస్' టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి..?

మనకు నచ్చిన వ్యక్తికి దగ్గరకావడానికి వారి గురించి తెలుసుకోవడానికి మనకు కనీసం సంవత్సరకాలం పడుతుంది.  అయితే మొదట్లో వారి గురించి తెలుసుకోవాలనే ఆతురత రానురానూ తగ్గిపోతుంటుంది. ఆతరువాత వారు కలిసి ఉండలేరని నా ఒపీనియన్. అందుకే ఈ చిత్రానికి ఈ టైటిల్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని '365 డేస్' ను కన్ఫర్మ్ చేసాను.

ఇద్దరు కలిసి బ్రతకలేరని, పెళ్లి చేసుకోవద్దని చెప్తున్నారా.. ఈ సినిమాలో?

అలా అని నేను జడ్జిమెంట్ ఇవ్వట్లేదు. నా పర్సనల్ లైఫ్, నా చుట్టూ ఉండే జీవితాల ఆధారంగా తీసిన చిత్రమే ఇది. ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్స్ ఇలా ఉన్నాయి అని చెప్పడానికే సినిమా తీసాను కానీ ఎవరిని పెళ్లి చేసుకోవద్దు అని నేను చెప్పట్లేదు. ఈ సినిమాలో కొంత భాగం నా పర్సనల్ ఎక్స్ పీరియన్స్. మిగిలినది తెలిసిన వాళ్ళ దగ్గర నుండి తీసుకున్నాను. అందరి జీవితాల్లో జరిగేదే కాబట్టి సినిమా అందరికి కనెక్ట్ అవుతుంది. 

మీ దృష్టిలో భవిష్యత్తులో పెళ్ళనేది ఉండదా..?

ప్రస్తుతం అందరూ ఓ పర్సనల్ జానే ఏర్పరుచుకొని బ్రతుకుతున్నారు. లైఫ్ పార్టనర్ లైఫ్ లోకి రావడానికి కూడా ఇష్టపడట్లేదు. ఒకరి గురించి ఒకరు అడ్జస్ట్ అవలేకపోతున్నారు. అందుకే కొన్నిరోజుల తరువాత అసలు పెళ్లనేదే ఉండదు. ఇప్పటికే లివింగ్ రిలేషన్ షిప్స్ అనే కాన్సెప్ట్ పై ఎక్కువ మంది ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. త్వరలో వీకెండ్ షిప్స్ కూడా వస్తాయేమో..

మొదటిసారి మీ సినిమాకి క్లీన్ 'యు' సర్టిఫికేట్ ఇచ్చారు. దానిపై మీ అభిప్రాయం..?

ఫస్ట్ తెలియగానే షాక్ అయ్యాను. నాకు ఏ సర్టిఫికెట్ వచ్చినా పెద్దగా పట్టించుకోను. ఇప్పటివరకూ క్రైమ్, హర్రర్ నేపథ్యంలోనే ఎక్కువ సినిమాలు తీయడంతో నేను క్లీన్ ‘యు’ అనేది ఎప్పుడూ చూడ్లేదు.

పెద్ద సినిమాలు చేసే మీరు చిన్న సినిమాలు చేస్తున్నారెందుకు..?

నా దృష్టిలో పెద్ద సినిమా, చిన్న సినిమా అనేం లేదు. సినిమా కథ నచ్చితే చాలు. దానికి తగ్గట్లుగా బడ్జెట్ వేసుకుంటాం. అంతే కానీ పెద్ద సినిమాగా చేసేయాలి అని అనవసరమైన బడ్జెట్ వేయను.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

'కిల్లింగ్ వీరప్పన్' అనే ఓ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కించనున్నాను. దానిని కూడా పరిమితి బడ్జెట్ లోనే చేయనున్నాం. బడ్జెట్ పెంచినంత మాత్రాన సినిమా హిట్ అవదు కదా. సినిమా హిట్ అయితే చిన్న సినిమాయే పెద్ద సినిమా అవుతుంది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs