Advertisement
Google Ads BL

అమ్మ బాబు.. లోకేష్‌ కోసం పెద్ద ఎత్తుగడే వేశాడు..!!


మీడియాను వాడుకోవడంలో బాబు తర్వాతే ఎవరైనా అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పబ్లిసిటీ స్టంట్‌లో రారాజుగా వెలుగొందుతున్న బాబుకు నెటిజన్లలో మంచిపబ్లిసిటీ ఉంది. అయితే చేసింది గోరంతైనా.. చెప్పుకునేది కొండంత అంటూ బాబు వ్యతిరేకులు ఆయన గురించిప్రచారం చేస్తారు. అయితే లోకేష్‌బాబును కూడా ఓ రేంజ్‌లో ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకున్న బాబు వేసిన ఎత్తుగడ ఇప్పుడు చిత్తై ఆయన పరువు తీసింది.

Advertisement
CJ Advs

ప్రస్తుతం లోకేష్‌బాబు అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడ పలువురు వ్యాపారవేత్తలతో సమావేశమైన ఆయన ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానించారు. దీనికి టీడీపీ మీడియా విస్తృత ప్రచారం కల్పించింది. దీనికితోడు మే 7న అమెరికా అధ్యక్షుడితో లోకేష్‌బాబు భేటీ కానున్నారని, ఏపీకి సంబంధించిన పలు ప్రాజెక్టుల విషయమై లోకేష్‌బాబు ఒబామాతో చర్చిస్తారని కూడా చెప్పింది. దీంతో అమెరికా అధ్యక్షుడు లోకేష్‌బాబును కలవడంపై ప్రజలతోపాటు మీడియాలోనూ విస్తృతంగా చర్చలు కొనసాగాయి. దీనిపై లోకేష్‌కు మంచి మైలేజీ కూడా వచ్చింది. అయితే లోకేష్‌బాబు అమెరికా అధ్యక్షుణ్ని వ్యక్తిగతంగా కలవడం లేదని, పార్టీ ఫండ్‌ రైజింగ్‌ ప్రోగ్రాంకు సంబంధించి ఒబామాకు డబ్బులు చెల్లించిమరీ 2 నిమిషాల సమాయాన్ని లోకేష్‌ దక్కించుకున్నారని సాక్షి దినపత్రిక ఓ కథనం ప్రచురించింది. ఇది లోకేష్‌బాబుకు మాత్రమే ప్రత్యేకం కాదని, రూ. 6.2 లక్షలు చెల్లించి ఎవరైనా ఈ ఆఫర్‌ను దక్కించుకోవచ్చని కూడా చెప్పింది. అయితే 20 రోజుల ముందుగానే ఈ టికెట్‌ కొన్నా చంద్రబాబు తన కుమారుడికి ఓ రేంజ్‌లో పబ్లిసిటీ తేవడానికే ఈ డ్రామాకు తెరతీశాడని ఆరోపించింది. దీంతో అసలు విషయం బయటకు వచ్చి.. టీడీపీ ఉన్న పరువు పోయింది. ఒకవేళ ఈ విషయం బయటకు రాకపోయి ఉంటే.. మే7న ఒబామాను లోకేష్‌బాబు కలిసిన తర్వాత టీడీపీ మీడియా ఇంకెంత హడావుడి చేసేదోనని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs