Advertisement

ఆ రంగాల్లో హైదరాబాద్ కు ఉజ్వల భవిష్యత్..!


విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్, గేమింగ్ రంగాలలో హైదరాబాద్ సంస్థలు మంచి పనితీరును కనబరుస్తున్నాయి. తెలుగు, తమిళ, హిందీతో సహా పలు భాషల చిత్రాలకు ఇక్కడి సంస్థలు విజువల్ ఎఫెక్ట్స్ పనులను చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖా మంత్రి కేటిఆర్ చక్కని ప్రోత్సాహం అందిస్తున్నారు. ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తే 90లలో ఐటి అభివృద్ధి చెందినట్టు.. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ రంగాలలో హైదరాబాద్ అగ్రగామిగా నిలుస్తుంది. దీని కోసం ప్రత్యేకంగా ఓ హబ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం అని డిజిక్వెస్ట్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ఏవిసిజిఐ అధ్యక్షులు శ్రీ కోత బాసిరెడ్డి గారు అన్నారు.   

Advertisement

ఇటీవల ఢిల్లీలో భారత పరిశ్రమల సంఘం(సిఐఐ) ఆధ్వర్యంలో జరిగిన గ్లోబల్ ఎగ్జిబిషన్ సర్వీస్ లో తెలంగాణ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ కామిక్ అండ్ గేమింగ్ (ఏవిసిజిఐ) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పలు అంతర్జాతీయ, జాతీయ సంస్థలు ఏవిసిజిఐ ప్రదర్శనను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఏవిసిజిఐ రంగంలో ఉన్న ప్రముఖ సంస్థలు మంగళవారం హైదరాబాద్ లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఇంకా శ్రీ కోత బాసిరెడ్డి గారు మాట్లాడుతూ..  కేటీఆర్ ప్రోత్సాహంతో ఢిల్లీలో ప్రదర్శన విజయవంతం అయ్యింది. ఇతర నగరగాలకు చెందిన కంపెనీలతో పోలిస్తే తక్కువ ఖర్చులో క్వాలిటీ వర్క్ అందిస్తుండడంతో సినీ నిర్మాతలు, యానిమేషన్ వీడియోలకు రూపకల్పన చేసేవారి చూపు హైదరాబాద్ కంపెనీలపై పడింది. యువతకు ఈ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయని అన్నారు. 

విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్ రంగంలో నిపుణుల కొరత ఉంది. అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరు నెలల నుండి ఏడాది వ్యవధి గల కోర్స్ లను అందిస్తున్నాం. 10వ తరగతి చదివినా.. సినిమాలపై ఆసక్తి ఉన్నవారు ఈ కోర్స్ లు చేయవచ్చు. కోర్స్ పూర్తయిన తర్వాత చక్కని అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగం గ్యారెంటీ. హైదరాబాద్ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని రోటో మేకర్ కంపెనీ అధినేత మైక్ యాతం అన్నారు. 

హాలీవుడ్ చిత్రాలలో ఓ సన్నివేశంలో విజువల్ ఎఫెక్ట్స్ చేయడానికి రూ.20కోట్లు ఖర్చు పెడుతున్నారు. హైదరాబాద్ సంస్థలు వాటికి ఏమాత్రం క్వాలిటీ తగ్గకుండా రూ.2 కోట్లలో వర్క్ చేస్తున్నాం. మగధీర, ఈగ చిత్రాలకు మన సంస్థలు పని చేశాయి. బాహుబలికి కూడా పని చేస్తున్నామని ఫైర్ ఫ్లై మీడియా సంస్థ ప్రతినిది జునైద్ తెలిపారు. ఈ సమావేశంలో జిఎస్ డిజిటల్ డ్రీమ్ డిజైనర్ సంస్థకు చెందిన గోలి శ్యామల, ఎక్స్ - క్యూబ్ గేమ్స్ సంస్థకు చెందిన నిర్విక్, గేమింగ్ వర్చ్యువల్ రియాలిటీ సంస్థకు చెందిన చిమేర్, రామానాయుడు ఫిల్మ్ అండ్ ఐఏసిజి రామకృష్ణ పాల్గొన్నారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement