Advertisement

కేసీఆర్‌లో.. ఎందుకంత భయం..??


తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు టీఆర్‌ఎస్‌ ప్రతిరోజు ఉప ఎన్నికల సవాలు విసురుతుండేది. ప్రజల్లో తమపై విశ్వాసం సన్నగిల్లుతుందనుకునే సమయానికి గులాబి దళం బాస్‌ ఉప ఎన్నికల రాగం ఎత్తుకునేవారు. ఇదే అదనుగా తెలంగాణవాదాన్ని మరింత బలంగా కేంద్రానికి వినిపించడానికి తమకే ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరడంతో అఖండ మెజార్టీతో వారు గులాబి దళాన్ని అందలమెక్కించేవారు. ఇక ఏ నాయకుడు టీఆర్‌ఎస్‌ వర్గాన్ని విమర్శించినా గులాబి దళం నుంచి ఒకే సమాధానం వచ్చేంది. దమ్ముంటే ఉప ఎన్నికలకు రావాలంటూ సవాలు విసిరి తమదే పైచేయి అనిపించుకునేవారు. కాని అదే పార్టీ ఇప్పుడు ఉప ఎన్నికలంటే గజగజ వణికిపోతోంది. కనీసం జీహెచ్‌ఎంసీ ఎన్నికలు కూడా నిర్వహించే ధైర్యం లేక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. మరి ఇంతలో టీఆర్‌ఎస్‌ శైలి ఎందుంత మారిపోయింది..?.

Advertisement

 

ఒకటికి పది హామీలిచ్చి అధికారంలోకి వచ్చే పార్టీలు వాటిని నిలబెట్టుకోవడం అంత సులభం కాదు. ఇక ఎన్నికలకు ముందు తనను వచ్చి కలిసిన ప్రతి వర్గానికి హామీలి గుప్పించాడు  కేసీఆర్‌. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తాననడం, నిరుద్యోగుల కోసం లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్లు, దళితులకు భూములు.. ఇలా చెప్పుకుంటూ పోతే అలిసిపోయే రేంజ్‌లో కేసీఆర్‌ హామీలు గుప్పించాడు. ఇప్పుడు వాటిని అమలు చేయడానికి నిధుల కొరతతో ఆయన సతమతమవుతున్నాడు. ఈ తరుణంలో ఎన్నికలు రాకుండా చూసుకోవడమే నయమన్న భావన టీఆర్‌ఎస్‌ వర్గంలో ఉంది. ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి జంప్‌ చేసిన నాయకులు మళ్లీ రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలవాలని విపక్షాలు ఎంతగా విమర్శించినా టీఆర్‌ఎస్‌ నాయకులు వినని చెవులు వేసుకొని ముందుకు పోతున్నారు. మరి ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకుంటే మాత్రం ఉప ఎన్నికలు కచ్చితంగా నిర్వహించాల్సి ఉంటుంది. మరింత కాలం పోటీని తప్పించుకొని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందుకు వెళ్తుందో వేచిచూడాలి.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement