Advertisement
Google Ads BL

రాందేవ్‌ మందులు తింటే మగపిల్లలే పుడుతారట..!!


బాబా రాందేవ్‌.. పరిచయం అక్కరలేని ఈ పేరు యావత్‌ ప్రపంచంలో యోగాకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింది. ఇక ఆయన స్థాపించిన కంపెనీలో తయారవుతున్న ఆయుర్వేద మందులకు ఎనలేని గిరాకి. అయితే బాబా రాందేవ్‌ కంపెనీనుంచి వెలువడుతున్న ఓ మందు ఇప్పుడు చర్చలకు తావైంది. ఆ మందు వాడితే మగ పిల్లలు పుడుతారంటూ రాందేవ్‌ కంపెనీ ప్రచారం చేయడం ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువులా మారింది. బాబాకు చెందిన దివ్యా ఫార్మసీ 'పుత్ర జీవక్‌ బీజ్‌' అనే మందును వాడితే కేవలం మగ పిల్లలే పుడుతారంటూ ఆ కంపెనీ ప్రతినిధులు ప్రచారం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదేవిషయమై లోక్‌సభలో కూడా జేడీయూ ఎంపీ కేసీ త్యాగి నిలదీశారు. ప్రభుత్వం వెంటనే ఆ మందును నిషేధించడంతోపాటు కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనికి విపక్షాలు కూడా మద్దతు పలికాయి. అయితే దీనిపై దివ్యా ఫార్మసీ సంస్థ స్పందించడానికి నిరాకరించింది. మరి బాబా ఈ మందు గురించి ఏంచెబుతారోనని ప్రజలంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. మరోవైపు ఈ వార్తతో పుత్ర జీవక్‌ బీజ్‌ మందుకు ఎనలేని ప్రచారం దక్కింది. దీంతో ఆ మందు అమ్మకం ఊపందుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs