మోదీ రాజకీయ ఎత్తుగడలను గమనిస్తే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా ఇవ్వవలసిన నైతిక బాధ్యతనుంచి బిజెపి తప్పుకోదనే విశ్వసించాలి. రాష్ట్ర విభజనపై కాంగ్రెసు వైఖరిని దుయ్యబడుతూ ఒక బిడ్డకు జన్మనివ్వడానికి మరో బిడ్డను చంపేశారు అని విమర్శించారు మోదీ. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదాపై పట్టుబట్టి ప్రధాని ప్రకటన చేసేలా ఒత్తిడిపెంచింది వెంకయ్యనాయుడే. అటువంటి బిజెపి ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై ‘యుటర్న్’ తీసుకునే ప్రసక్తేలేదు. ‘ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా’ అన్నది మోదీ విశ్వసనీయతకు పెద్దపరీక్ష. అయితే వెనుకబడిన తమకూ ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండు చేసిన బీహార్, పశ్చిమ బెంగాల్ మరియు తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి ఆ పైన ఉత్తరప్రదేవ్‌కి ఎన్నికలు రానున్నాయి. అన్నిటినీమించి బీహార్, పశ్చిమబెంగాల్ ఎన్నికలు బిజెపికి కీలకం. తమ భాగస్వామి పక్షమైన టిడిపి అధికారంలోనున్న ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా ఇస్తే ‘బీహార్’లోని అధికారపక్షానికి ఓ ఆయుధం ఇచ్చినట్లవుతుందని బిజెపి సందేహిస్తోంది. ఆంధ్ర, తెలంగాణకి ప్రత్యేకహోదా లేదా అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఖాయం. చూద్దాం పవర్ పాలిటిక్స్ ఎలా మారతాయో!