Advertisement
Google Ads BL

విజయవాడ మెట్రోపై శ్రీధరన్‌ తేల్చేశారు..!!


విజయవాడ మెట్రోకు సంబంధించిన తుది నివేదికను శ్రీధరన్‌ చంద్రబాబు నాయుడుకు అందజేశారు. విజయవాడలో మెట్రో రైల్‌ నిర్మాణానికి మొత్తం రూ.6823 కోట్టు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. విజయవాడ బస్టాండ్‌నుంచి పెనమలూరు వరకు, అలాగే బస్టాండ్‌ నుంచి నిడమనూరు వరకు మెట్రో రైల్‌ ఏర్పాటు చేయాలని ఏపీ సర్కారు భావిస్తోంది. ఇక కిలోమీటర్‌కు రూ. 207 ఖర్చు చొప్పున మొత్తం ఈ ప్రాజెక్టుకు రూ.6823 కోట్లు అవసరమని మెట్రో శ్రీధరన్‌ లెక్కగట్టారు. ఇక ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న తెలుగువాడు వెంకయ్యనాయుడు ఈ ప్రాజెక్టుకు కేంద్రంనుంచి భారీగానే నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఇప్పటికే విభజన చట్టంలో మెట్రో నిర్మాణానికి కేంద్రం సాయం అందిస్తుందన్న హామీ పొందుపర్చారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు త్వరలోనే కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక హైదరాబాద్‌ మెట్రో కూడా పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా తెలుగువాడు జైపాల్‌రెడ్డి ఉన్నప్పుడే కార్యరూపం దాల్చిన సంగతి తెలిసిందే. అయితే విజయవాడ మెట్రో పనులను ప్రైవేటు కంపెనీలకు అప్పగించే అవకాశాలున్నాయి. అయితే మెట్రో శ్రీధరన్‌ ఢిల్లీ మాదిరిగా ఈ ప్రాజెక్టును ప్రభుత్వమే చేపడితే మేలని సూచించినట్లు సమాచారం.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs