'1 నేనొక్కడినే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యి తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో అవకాశాలు అందిపుచ్చుకుంటున్న హీరోయిన్ కృతిసనన్. ప్రస్తుతం కృతి నటించిన 'దోచేయ్' మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా కృతిసనన్ తో 'సినీజోష్' ఇంటర్వ్యూ.
ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది..?
'దోచేయ్'లో నేను మీరా అనే ఓ మెడికల్ స్టూడెంట్ పాత్రలో నటించాను. అదొక టామ్ బాయ్ క్యారెక్టర్. అసలు మీరా కు చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు. అబ్బాయిలా డ్రెస్ చేసుకుంటుంది. చాలా డామినేట్ చేస్తూ ఉంటుంది. మనసులో ఏముందో నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. నా మొదట సినిమాకి 'దోచేయ్' కి చాలా వేరియేషన్ ఉంటుంది. కెరీర్ లో మొదటి సినిమా ఎంత ముఖ్యమైనదో రెండో సినిమా కూడా అంతే ముఖ్యమైనది. '1 నేనొక్కడినే' మూవీకి ఎంత కష్టపడ్డానో ఈ సినిమాకు కూడా అంతే కష్టపడ్డాను.
సినిమాలో పాత్రకు మీ నిజజీవితానికి దగ్గర పోలికలు ఉన్నాయా..?
సినిమాలో మీరా క్లాస్ బంక్ చేస్తూ టామ్ బాయ్ లా తిరుగుతూ ఉంటుంది. నేను అలా ఎప్పుడు చేయలేదు. నేను కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాను. చాలా డేర్ సిట్యువేషన్స్ ఫేస్ చేసాను. కొంచెం సెంటిమెంట్ కూడా ఉంది.
సినిమా ఎలా ఉండబోతోంది..?
ఇదొక ఫన్, ఎంటర్ టైనింగ్ మూవీ. థ్రిల్లర్ అని చెప్పలేం కాని అలాంటి సీన్స్ ఉంటాయి. ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. లవ్, కామెడీ, ఎమోషనల్ సన్నివేశాలు అన్ని ఉంటాయి. రొటీన్ గా అయితే ఉండదు. అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది.
నాగచైతన్య తో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది..?
నాగచైతన్య చాలా తక్కువ మాట్లాడతాడు. చాలా స్వీట్, కూల్ పర్సన్. సీనియారిటీ ఏం చూపించడు. ఒకే ఏజ్ గ్రూప్ వలన వర్క్ చాలా కంఫర్ట్ అనిపించింది. చైతు స్పాంటేనియస్ యాక్టర్.
డైరెక్టర్ గురించి..?
సుధీర్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు. తనకు ఏం కావాలో చాలా బాగా తెలుసు. క్లారిటీగా ఉంటాడు. ఎక్కువ టేక్స్ తీసుకోవడానికి ఇష్టపడడు. తనకొక స్పెషల్ వే ఉంటుంది.
క్రిటిసిజం పై మీ ఒపీనియన్..?
ప్రస్తుతానికి నా మీద ఎలాంటి గాసిప్స్ లేవు. గాసిప్స్ కూడా ఇండస్ట్రీలో భాగమే. ప్రతిది చాలా పాజిటివ్ గా తీసుకుంటాను. ఒకరు నా గురించి చెప్పి ఏమైనా చేంజ్ అవమంటే ఖచ్చితంగా ఆలోచిస్తాను.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?
ఇప్పటివరకు తెలుగులో ఏ సినిమాకి సైన్ చేయలేదు. హిందీలో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. షారుఖాన్ 'దిల్వాలే' , 'ఫర్జే' సినిమాలలో నటిస్తున్నాను.