Advertisement
Google Ads BL

సినీజోష్‌ ఇంటర్వ్యూ: నిత్యమీనన్‌


నిత్యమీనన్‌... ఎలాంటి క్యారెక్టర్‌ని అయినా పరకాయ ప్రవేశం చేసి అద్భుతంగా నటించి అందర్నీ మెప్పించగల నటి. దక్షిణ భారతదేశంలో చెప్పుకోదగిన నటీమణుల్లో నిత్య మీనన్‌ ఒకరు. ఈ సంవత్సరం మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, సన్నాఫ్‌ సత్యమూర్తి, ఓకే బంగారం, తమిళ్‌లో కాంచన 2  వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న నిత్యమీనన్‌తో ‘సినీజోష్‌’ ఇంటర్వ్యూ.

Advertisement
CJ Advs

ఈ సంవత్సరం మీరు చేసిన సినిమాలన్నీ మంచి హిట్‌ అయ్యాయి. దీనిపై మీ స్పందన?

చాలా సంతోషంగా వుంది. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు నాకు చాలా మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత సన్నాఫ్‌ సత్యమూర్తిలో కూడా నేను చేసిన డిఫరెంట్‌ క్యారెక్టర్‌కి మంచి అప్రిషియేషన్‌ వస్తోంది. ఓకే బంగారం చిత్రానికి వస్తున్న రెస్పాన్స్‌ మీ అందరికీ తెలుసు. అలాగే తమిళంలో కాంచన2లో కూడా నేను ఇప్పటివరకు చెయ్యని క్యారెక్టర్‌ చేశాను. ఆ సినిమా మంచి విజయం సాధించడమే కాకుండా నా క్యారెక్టర్‌ కూడా చాలా బాగుందన్న ప్రశంస వస్తోంది. తెలుగులో ఈ చిత్రం ‘గంగ’గా రాబోతోంది. ఈ సంవత్సరం నేను చేసిన సినిమాలన్నీ డిఫరెంట్‌ జోనర్స్‌లో వచ్చాయి. ఒక ఆర్టిస్ట్‌గా ఈ నాలుగు సినిమాలు నాకు సంతృప్తిని కలిగించాయి. 

సన్నాఫ్‌ సత్యమూర్తిలో ఫుల్‌ లెంగ్త్‌ క్యారెక్టర్‌ కాకపోయినా చెయ్యడానికి రీజన్‌?

త్రివిక్రమ్‌గారు చేసిన అత్తారింటికి దారేది నాకు చాలా బాగా నచ్చింది. ఆ సినిమాని ఒక కమర్షియల్‌ వేలో చాలా అద్భుతంగా తీశారు. ఆయన టేకింగ్‌గానీ, కథగానీ, మాటలుగానీ నాకు చాలా బాగా నచ్చాయి. ఎప్పుడూ పెర్‌ఫార్మెన్స్‌ ఓరియంటెడ్‌ మూవీసే కాకుండా మంచి కమర్షియల్‌ మూవీలో కూడా నటించాలని అనిపించింది. అందుకే సన్నాఫ్‌ సత్యమూర్తిలో చిన్న క్యారెక్టర్‌ అయినా చేశాను. 

లివింగ్‌ రిలేషన్‌పై వచ్చిన ‘ఓకే బంగారం’లో మీరు చేసిన క్యారెక్టర్‌ మీకెలా అనిపించింది?

ఈ చిత్రంలో నేను చేసిన తార క్యారెక్టర్‌కి నేను బాగా కనెక్ట్‌ అయ్యాను. మణిరత్నంగారు లాంటి గొప్ప డైరెక్టర్‌తో సినిమా చేయడం అంటే ఎంతో సంతోషాన్ని కలిగించే విషయం. ఆయనతో వేవ్‌ లెంగ్త్‌ కూడా బాగా కుదిరింది. సాధారణంగా అన్నీ నాకు నచ్చకపోతే సినిమా చెయ్యను. ఒక సినిమా చేసే ముందు సినిమాలో డైరెక్టర్‌ నన్ను ఎలా చూపించబోతున్నారు? నన్ను ఎలా ట్రీట్‌ చెయ్యబోతున్నారు అనే విషయాలు ఆలోచిస్తాను. వాటిని బట్టే ఆ సినిమా చెయ్యాలా వద్దా అని నిర్ణయించుకుంటాను. ఓకే బంగారం విషయానికి వస్తే ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ని ఎంతో ప్రేమించి చేశాను. లివింగ్‌ రిలేషన్‌లో వున్నవారిపై నాకు గౌరవం వుంది. అయితే ఇంతకుముందు పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు. ఒకప్పుడు అబ్బాయి, అమ్మాయి ఒకరినొకరు చూసుకోకుండానే పెళ్ళి చేసుకునేవారు. కానీ, ఇప్పుడలా కాదు. అన్నీ మారిపోయాయి. కాబట్టి మార్పు అనేది అనివార్యం. అన్ని విషయాలు మారినట్టే పెళ్ళి విషయంలో, ప్రేమ విషయాల్లో కూడా మార్పు వచ్చింది. దాన్ని ఈ సినిమాలో మణిరత్నంగారు చాలా అద్భుతంగా చూపించారు. 

మణిరత్నం సినిమా చేయడం ఎలా అనిపించింది?

చెప్పాను కదా అది ఒక అదృష్టం. లివింగ్‌ రిలేషన్‌ మీద సినిమా చెయ్యాలని మరో డైరెక్టర్‌ చెప్పి వుంటే ఖచ్చితంగా ఒప్పుకునేదాన్ని కాదు. మణిరత్నంగారి మీద నమ్మకంతో, తప్పకుండా సినిమా చాలా బాగా తీస్తారని ఓకే చెప్పాను. సేమ్‌టైమ్‌ డైరెక్టర్‌గారికి కూడా నా మీద అపారమైన నమ్మకం వుంది. అందుకే నన్ను సెలెక్ట్‌ చేసుకున్నారు. నేను ఊహించిన దానికంటే సినిమా బాగా తీశారు. ఆయనకి అద్భుతమైన విజన్‌ వుంది. దాన్ని హండ్రెడ్‌ పర్సెంట్‌ స్క్రీన్‌ మీద చూపించారు. నేను చేసిన ప్రతి సినిమాకీ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటాను. అలాగే ఈ సినిమా చేసేటపుడు కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. 

హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమాలు చేసే ఆలోచన వుందా?

కేవలం హీరోయిన్‌కి మాత్రమే ప్రాధాన్యం వుండే సినిమా చెయ్యాలని నేను అనుకోవడం లేదు. ముందు కథ నచ్చాలి, ఆ తర్వాత నా క్యారెక్టర్‌ నచ్చాలి. అది చిన్న క్యారెక్టర్‌ అయినా, పెద్ద క్యారెక్టర్‌ అయినా ఎక్సైట్‌ చేసే విధంగా వుండాలి. అత్తారింటికి దారేది చిత్రంలో నదియా క్యారెక్టర్‌ నాకు బాగా నచ్చింది. భార్య క్యారెక్టర్‌ అయినా అలాంటి క్యారెక్టర్‌ చెయ్యడానికి ఇష్టపడతాను. 

నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్స్‌?

ఇప్పుడు అన్నీ రిలీజ్‌ అవ్వడానికి సిద్ధంగా వున్నాయి. బెంగుళూరు డేస్‌ రీమేక్‌ షూటింగ్‌ జరుగుతోంది. ఈ కథను మలయాళంలో అంజలి నాకోసం రాసింది. కానీ, అప్పుడు చేయడం కుదరలేదు. అయితే ఇప్పుడు తమిళ్‌ రీమేక్‌లో నటిస్తున్నాను. మరికొన్ని సినిమాలు వున్నాయి అంటూ ఇంటర్వ్యూ ముగించారు నిత్య మీనన్‌. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs