ఆంధ్రప్రదేశ్‌లో ఒలంపిక్ సంఘం వ్యవహారం తెలుగుదేశంలో అలజడి రేపుతోంది. ఒలంపిక్ సంఘం చైర్మన్ పదవి కోసం అటు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఇటు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌లు పోటీపడుతున్నారు. ఇప్పటికీ ఒలంపిక్ సంఘం అసోసియేషన్‌కు ఎన్నికలు జరిగాయని, తాను చైర్మన్‌గా ఎన్నికైనట్లు గల్లా జయదేవ్ చెబుతున్నారు. మరోవైపు ఇంకా ఎన్నికలు జరగలేదని, ఆదివారం ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఎం రమేష్ వర్గం శనివారం ప్రకటించింది. దీంతో వారిద్దరి మధ్య వర్గపోరు నడుస్తోంది. ఇక చివరకు ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో సీఎం రమేష్ ఒలంపిక్ అసోసియేషన్ చైర్మన్‌గా ఎన్నికయ్యాడని, హైకోర్టు ఆదేశాల మేరకు జరిగిన ఈ ఎన్నికలకే గుర్తింపు ఉంటుందని ఏపీఓఏ ప్రకటించింది. ఇది గల్లా జయదేవ్ వర్గాన్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. మరోవైపు తెలంగాణలో ఎలాంటి పోటీలేకుండా ఎంపీ జితేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఆ రాష్ట్ర ఒలంపిక్ అసోసియేషన్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇక ఏపీకి సంబంధించి కూడా చంద్రబాబు కల్పించుకొని ఇద్దరు ఎంపీల మధ్య విభేదాలను దూరం చేసి అసోసియేషన్ చైర్మన్‌ను ప్రకటించాలని తెలుగు తమ్ముళ్లు కోరుకుంటున్నారు.