గత కొన్ని రోజులుగా ‘మా’ సింహాసనం గురించి జరుగుతున్న పోరు నేటితో (ఏప్రిల్17) ముగిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కోర్టు మెట్ల వరకు వెళ్ళివచ్చిన ‘మా’ ఎన్నికల్లో విజయం అనుకున్నట్లుగానే రాజేంద్రప్రసాద్‌ని వరించింది. మురళీమోహన్ ఏకచత్రాధిపత్యం నుండి ‘మా’ సింహాసనాన్ని రాజేంద్రప్రసాద్ చేజిక్కించుకున్నారు. మొత్తం ఈ ఎన్నికల్లో 394 ఓట్లు పోల్ అవ్వగా అందులో 237 ఓట్లు రాజేంద్రప్రసాద్‌కి పోల్ అయ్యాయి. రాజేంద్రప్రసాద్ ప్రత్యర్ధులైన జయసుధకు 152, ధూళిపాళ్లకు 5 ఓట్లు పోల్ అయ్యాయి. దీంతో రాజేంద్రప్రసాద్ 85 ఓట్ల మెజార్టీతో జయసుధని ఓడించి, ‘మా’ సింహాసనాన్ని అధిష్టించేందుకు రెడీ అయ్యారు. రాజేంద్రప్రసాద్ విజయంతో ఫిల్మ్ ఛాంబర్ వద్ద అతని అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.