Advertisement
Google Ads BL

జగన్‌ని చూస్తే ‘అన్నమయ్య’ సినిమా గుర్తొస్తోంది!


‘అన్నమయ్య’ సినిమా ప్రారంభంలో అన్నమయ్యలో ఆవేశాన్ని కయ్యానికి కాలుదువ్వే స్వభావాన్ని చూస్తాం. తర్వాత భోగి యోగిగా మారడం, వాగ్గేయకారుడుగా పరిణతి చెందడం చూస్తాం. జగన్‌లో ఆ దూకుడు, మాటల తూటాలు పేల్చడం క్రమక్రమంగా తగ్గిపోతోంది. శాసనసభలో వైయస్సార్‌సీపీ సభ్యుల భాష, ప్రత్యేకించి ‘రోజా రేప్‌’ ఉదంతం పార్టీకి చెరుపుచేసేలా కనిపించింది. ఈ సమయంలో జగన్‌ సభా గౌరవాన్ని పాటిస్తూ హూందాగా స్పీకర్‌కి క్షమాపణ చెప్పడం; స్పీకరుపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోవడం విజ్ఞుల మన్ననలను అందుకున్నది. బడ్జెట్‌పై చర్చలో గణాంకాలతో సహా విపులంగా చర్చించడం చూడటానికి ముచ్చటేసింది. భవిష్యత్తులో జగన్‌ గొప్ప నాయకుడు కాగలడు - అన్న నమ్మకాన్ని కలిగించింది. అవసర సమయంలో తాను తగ్గి ప్రజా హృదయాలలో ఎదిగాడు జగన్‌.
- తోటకూర రఘు

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs