Advertisement
Google Ads BL

భారత్‌ యువతి ప్రపంచ నెం. 1గా నిలిచింది..!!


సైనా నెహ్వాల్‌ పరిచయం అక్కరలేని ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ఇదివరకు ఏ భారతీయ మహిళకు సాధ్యంకాని రికార్డ్‌ను ఆమె సొంతం చేసుకుంది. బ్యాడ్మింటన్‌లో చైనా, మలేషియా దేశాల క్రీడాకారులదే దశాబ్దాలుగా ఆధిపత్యం కొనసాగుతోంది. అయితే భారత్‌నుంచి బ్యాడ్మింటన్‌ క్రీడలో తారాజువ్వలా దూసుకొచ్చిన సైనానేహ్వాల్‌ ఇప్పుడు ప్రపంచం నం. 1 ర్యాంకును సొంతం చేసుకుంది. అగ్రస్థానం కోసం తనతో పోటీలో ఉన్న మారిన్‌(స్పెయిన్‌) ఇండియా ఓపెన్‌సెమీస్‌లో పరాజయం పాలవడంతో రెండో ర్యాంకులో ఉన్న సైనా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఆదివారం అధికారికంగా ర్యాంకులు ప్రకటించనున్నారు. వాస్తవానికి 2010లోనే సైనా నెం. 1 ర్యాంకు దక్కించుకోవాల్సి ఉంది. అయితే అప్పుడు గాయాలతో మూడేళ్లపాటు సతమతమైన సైనాకు నెం. 1 ర్యాంకు దక్కించుకోవడానికి మరో ఐదేళ్లపాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఇక సైనాను రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు రాజకీయ ప్రముఖులు, క్రీడాకారులు అభినందించారు.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs