Advertisement
Google Ads BL

ఫ్లెక్సీలపై టాక్సు కు న్యాయస్ధానం ‘హుకుం’!


తెలుగు రాష్ట్రాలలో వీధి వీధి ఫ్లెక్సీలతో నిండి కనిపించేవి. ఎవరెవరివో ఫొటోలు - వారు ఏం ఘనకార్యం చేశారని? నగర శోభ చెరిపి, ట్రాఫిక్‌ సమస్యలు సృష్టించి రోడ్డుకిరువైపులా దడికట్టినట్టున్న ఫ్లెక్సీలను, విగ్రహాలను తొలగించమని; అవసరానికి పెట్టుకున్న ఫ్లెక్సీలపై టాక్సు విధించి ఆధాయం పెంచుకోవచ్చని సవినయంగా వేడుకున్నది ‘సినీ జోష్‌’. ఇదంతా ‘సినీ జోష్‌’ చెప్పినందునే - అని అనం గాని ‘సినీ జోష్‌’ ఆకాంక్ష న్యాయస్ధానం ‘హుకుం’లో ప్రతిఫలించింది. ఫ్లెక్సీల రోత తొలగింది. అయితే మరో ముఖ్య వినతి : సందర్భం ఏదయితేనేం, తరచుగా వాహనాల రణగొణ ధ్వనితో పెద్ద ఊరేగింపు జరుగుతుంటుంది. దీనివలన పెట్రోలు ఖర్చు; ట్రాఫిక్‌ సమస్య. సౌండ్‌ పొల్యూషన్‌, టైమ్‌ వేస్ట్‌! ఈ తరహా ఊరేగింపులకి అనుమతి ఇచ్చేటప్పుడు ఆ ఊరేగింపులో పాల్గొనే వాహనాలపై టాక్సు వేయండి. ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది - ఆయిల్‌ దుబారా తగ్గుతుంది - ట్రాఫిక్‌ సమస్య పరిష్కారమవుతుంది - సౌండ్‌ పొల్యూషన్‌కి చెక్‌ పడుతుంది.

Advertisement
CJ Advs

పాకిస్తాన్‌లో విద్యుత్తు పొదుపుకి కళ్యాణ మండపాలు - కళా మండపాల విద్యుత్తు అలంకరణని నిషేధించారు. హోటల్స్‌ కూడా పరిమితంగా విద్యుత్తు వాడుకోవాలి. భారత్‌కి పాక్‌ ఈ విషయంలో ఆదర్శం. 

పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు ఫెసిలిటీస్‌ - బస్‌ల ఫీక్వెన్సీ పెరగాలి. అప్పుడే ప్రైవేటు ట్రాన్సుపోర్టు తగ్గుతుంది. ఆయిల్‌ క్రైసిస్‌, ట్రాఫిక్‌ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది.

 ఫ్లెక్సీల పై గతం లో రాసిన ఆర్టికల్ చూసేందుకు Click Here

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs