ఏఫ్రిల్ మొదటి శుక్రవారం ‘‘గుడ్ ఫ్రైడే’’ : ప్రభువుని శిలువ వేసిన రోజు!
ఈ ‘గుడ్ ఫ్రైడే’ తర్వాత వచ్చే ఆదివారం : ఈస్టర్ : ప్రభువు పునరుత్థాన దినం!
- ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టియన్లకి అతి ముఖ్యమైన, పవిత్రమైన దినాలు ఇవి.
ఈ సంవత్సరం ప్రపంచ దేశాలన్నీ మతాలకు అతీతంగా ఈ రోజులలో క్రిస్టియన్లు జరుపుకునే కార్యక్రమాలకి సంఫీుభావం తెలపాలి. అందుకు బలమైన కారణం వుంది - ప్రపంచంలో చాలా చోట్ల క్రిస్టియన్లపై దాడులు జరుగుతున్నాయి. ప్రభుసేవకు - ప్రజా సేవకు అంకితమయిన డెబ్భై ఏళ్ళ క్రిస్టియన్ సన్యాసినిపై అఘాయిత్యం జరిగింది; క్రిస్టియన్ల గుండె గాయపడిరది, ప్రపంచ వ్యాప్తంగా మానవతావాదులు ముక్తకంఠంతో ఈ దారుణాన్ని ఖండిరచారు. సంఫీుభావం వ్యక్తం చేయడం సరిపోదు; ఆత్మీయ బంధం కావాలి; మీతో మేమున్నాం - అన్న భరోసా కావాలి.
అన్ని మతాలవారు తమ మత వ్యాప్తికి ప్రయత్నిస్తున్నారు. కొందరు ఉగ్రవాదాన్ని ఆశ్రయిస్తే, మరికొందరు విద్య - వైద్య - సేవల ద్వారా అన్నార్తులకు దగ్గరయి తమ మతంవైపు తిప్పుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ప్రపంచంలో అత్యధిక సంఖ్యలోనున్న క్రిస్టియన్ల గుండె గాయపడిరది. వారికి స్వాంతన కావాలి; మీతోపాటే మేమూ - అన్న భరోసా ఇవ్వాలి. లేకుంటే శాంతియుతంగా, సేవల ద్వారా మతాన్ని వేదికగా చేసుకుని జీవిస్తున్న క్రిస్టియన్లు మరోలా ఆలోచించే ప్రమాదం వుంది. అందుకే 2015 మార్చి 3న వచ్చే గుడ్ ఫ్రైడే; 5న వచ్చే ఈస్టర్‌కి క్రిస్టియన్లతో కలుద్దాం. వెలుగుతున్న కొవ్వొత్తి గాలికి ఆరిపోకుండా మనవంతుగా చేతులు అడ్డంపెడదాం!! మానవత్వాన్ని మించిన మతం లేదని నిరూపిద్దాం. అంది వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. రండి... ప్రపంచ ‘జ్యోతి’ని కాపాడుకుందాం!