Advertisement
Google Ads BL

సినీజోష్‌ ఇంటర్వ్యూ: రవివర్మ


‘వెన్నెల’ చిత్రంతో పరిచయమై తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రవివర్మ. ఆ తర్వాత బొమ్మరిల్లు, సైనికుడు, క్లాస్‌మేట్స్‌ చిత్రాల్లో ప్రాధాన్యత గల పాత్రలు పోషించారు. ‘రాఖీ’లో చేసిన నెగెటివ్‌ క్యారెక్టర్‌తో తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన రవివర్మ డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ చేస్తూ నటుడుగా స్టెప్‌ బై స్టెప్‌ ఎదుగుతూ వస్తున్న రవివర్మతో ‘సినీజోష్‌’ ఇంటర్వ్యూ.

Advertisement
CJ Advs

ఇప్పటివరకు మీరు చేసిన సినిమాల్లో మీకు బాగా పేరు తెచ్చినవి?

డెఫినెట్‌గా నా ఫస్ట్‌ మూవీ ‘వెన్నెల’ నాకు మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత ‘రాఖీ’లో చేసిన నెగెటివ్‌ క్యారెక్టర్‌ నన్ను మరో స్టెప్‌ పైకి తీసుకెళ్ళింది. క్లాస్‌మేట్స్‌, నీలకంఠగారి విరోధి చిత్రాల్లో సూపర్బ్‌ క్యారెక్టర్స్‌ చేశాను. ఇలా నా ఇంపార్టెన్స్‌ క్యారెక్టర్స్‌కి వుంటుంది. నా క్యారెక్టర్‌ స్టోరీని ఎలా మలుపు తిప్పుతుంది? నా క్యారెక్టర్‌ ఎంత రెస్పాన్సిబులిటీని షోల్డర్‌ చెయ్యగలుగుతుందీ అనేది గమనిస్తూ వుంటాను. అది నా ప్యాషన్‌. 

నటుడు అవ్వాలన్న కోరిక ఎప్పుడు కలిగింది?

చిన్నప్పుడు నేను కథక్‌ నేర్చుకున్నాను. అక్కడ నాకు ఆర్ట్స్‌తో ఒక బంధం, అనుబంధం ఏర్పడిరది. రెండు సంవత్సరాలు కథక్‌ నేర్చుకున్న తర్వాత మైమ్‌లో కూడా శిక్షణ పొందాను. స్కూల్‌లో చిల్డ్రన్స్‌ డే వస్తే నాదే స్పెషల్‌ అన్నట్టుగా వుండేది.  ఆ తర్వాత సి.బి.ఐ.టి.లో ఇంజనీరింగ్‌ చేసేటపుడు కూడా కాలేజ్‌లో కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌లో నేనే ఫస్ట్‌ వుండేవాడిని. ఆ తర్వాత యాక్టింగ్‌ కోర్సు నేర్చుకోవడానికి యు.ఎస్‌. వెళ్ళాను. అయితే అది చాలా ఎక్స్‌పెన్సివ్‌ కావడంతో చెయ్యలేకపోయాను. వెన్నెల స్టార్ట్‌ అవ్వడానికి నాలుగు సంవత్సరాల ముందు యు.ఎస్‌.లోనే దేవా కట్టాగారి దగ్గరికి ఆడిషన్‌కి వెళ్ళాను. తను మూవీ చేసేటపుడు ఛాన్స్‌ ఇస్తానని చెప్పారు. చెప్పినట్టే వెన్నెలలో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీలో యాక్టింగ్‌ కోర్స్‌ నేర్చుకున్నాను. యు.ఎస్‌. నుంచి పర్మినెంట్‌గా ఇక్కడికి వచ్చిన తర్వాత ‘ఒన్‌’ మూవీ చేశాను. ఆ తర్వాత వీకెండ్‌ లవ్‌, అలా ఎలా, బూచమ్మ బూచోడు, రీసెంట్‌గా తుంగభద్ర, కాలింగ్‌బెల్‌లో లీడ్‌ రోల్‌ చేశాను. 

ఎన్నో మంచి క్యారెక్టర్స్‌ చేసిన మీకు సరైన బ్రేక్‌ రాకపోవడానికి రీజన్‌?

నాకు ఇష్టమైన క్యారెక్టర్స్‌ చేసుకుంటూ వెళ్ళడం కూడా ఒక కారణం కావచ్చు. ‘రాఖీ’ తర్వాత అలాంటి నెగెటివ్‌ క్యారెక్టర్స్‌ చాలా వచ్చాయి. అయితే ఒకే టైప్‌ క్యారెక్టర్స్‌ చెయ్యడం నాకు ఇష్టం లేదు. ప్రతి క్యారెక్టర్‌ డిఫరెంట్‌గా వుండాలని కోరుకుంటాను. నేను ఇప్పటివరకు 25 సినిమాలు చేశాను. అందులో 15 సినిమాల్లో నేను చేసిన క్యారెక్టర్స్‌ అన్నీ ఒకేలా వుండవు. నెగెటివ్‌ క్యారెక్టర్స్‌ చేసినా అన్ని నెగెటివ్‌ క్యారెక్టర్స్‌ ఒకేలా వుండవు. అందుకే నేను బ్రేక్‌ గురించి ఎక్కువగా ఆలోచించలేదు. నేను చేసే క్యారెక్టర్‌ గురించి, ఆ క్యారెక్టర్‌కి నేను సరైన న్యాయం చేస్తానా లేదా అనేది ఆలోచించాను. నేను ఇప్పటివరకు పనిచేసిన డైరెక్టర్లందరికీ నా వర్క్‌ నచ్చింది. ఒక రైటర్‌కిగానీ, డైరెక్టర్‌కిగానీ వాళ్ళు రాసింది, అనుకున్నది ఔట్‌పుట్‌ రావాలన్న డ్రీమ్‌ వుంటుంది. నేను ఆ డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్‌ చేస్తూ నా డ్రీమ్‌ని కూడా ఫుల్‌ఫిల్‌ చేస్తున్నాను అనుకుంటున్నాను. 

రీసెంట్‌గా వచ్చిన ‘కాలింగ్‌బెల్‌’లో మీరు చేసిన క్యారెక్టర్‌కి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తోంది?

సూపర్బ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. థియేటర్‌లో సినిమా చూసాను. ఆడియన్స్‌ ఎంతో ఎంజాయ్‌ చేస్తున్నారు, భయపడుతున్నారు. అది నాకొక గుడ్‌ ఫీల్‌ని కలిగించింది. ఫస్ట్‌ టైమ్‌ లేడీస్‌ కూడా వచ్చి నెక్స్‌ట్‌ మీరు హీరోగా చేస్తున్న సినిమా ఏమిటి అని అడుగుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు హ్యాపీగా అనిపించిందంటే జనరల్‌గా విలన్‌ క్యారెక్టర్స్‌ చేసే వాళ్ళ దగ్గరికి లేడీస్‌ రారు. ‘రాఖీ’ రిలీజ్‌ అయిన తర్వాత నేను ఊరికి వెళితే నేను ఆ సినిమాలో బాగా చేసానని దూరంగా నిలబడి చెప్పుకుంటారు తప్ప మీరు బాగా చేశారని దగ్గరికి వచ్చి చెప్పరు. అది కూడా నేను గొప్ప కాంప్లిమెంట్‌గా ఫీల్‌ అవుతాను. 

నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్స్‌?

రెడీ ఫర్‌ రిలీజ్‌గా మంత్ర తులసీరామ్‌గారి ‘క్రిమినల్స్‌’ వుంది. నారా రోహిత్‌గారి ‘అసుర’ చిత్రంలో మెయిన్‌ కీ క్యారెక్టర్‌ చేస్తున్నాను. అడవి శేష్‌ హీరోగా పివిపి సినిమా చేస్తున్న ‘క్షణం’లో ఒక డ్రగ్‌ ఎడిక్ట్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాను. శ్రీకాంత్‌ హీరోగా చేస్తున్న సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నాను. నేను ఎలాంటి క్యారెక్టర్స్‌కి ఇంపార్టెన్స్‌ ఇస్తానో అలాంటి క్యారెక్టర్సే వస్తున్నాయి. ఈ సంవత్సరం 7 సినిమాల్లో 7 డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌లో కనిపిస్తాను. ఇవికాక మహేష్‌బాబుగారి ‘శ్రీమంతుడు’లో ఒక రోల్‌, ‘దోచేయ్‌’లో ఒక రోల్‌ చేస్తున్నాను. ఈ సంవత్సరం నాకు చాలా ప్రామిసింగ్‌గా అనిపిస్తోంది అంటూ ఇంటర్వ్యూ ముగించారు నటుడు రవివర్మ. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs