‘అన్నా’ క్యాంటీన్లు అటకెక్కినట్లేనా?
- ఓ పర్యాయం చార్లీ చాప్లిన్‌ని మిమిక్రీ చేసే పోటీ కార్యక్రమంలో చార్లీ చాప్లిన్‌కూడా అజ్ఞాత వ్యక్తిగా పాల్గొన్నాడట. అయితే ఆ పోటీలో ఆయన అయిదవ వానిగా నిల్చాడట!
- అర్జునుడు కృష్ణుని అడిగాడట ‘దానానికి కర్ణుడు అని అంటారెందుకు’ అని. సమాధానంగా ఓ బంగారు కొండని సృష్టించి ప్రజలకు పంచమన్నాడట కృష్ణుడు. మనుషులనుపెట్టి వచ్చిన వారికి లేదనకుండా పంచీపంచీ అలసిపోయిన అర్జునుడు ‘బావా, ఎంతపంచినా ఈ కొండ తరగదేమిటి?’ అని అడిగాడట. సమాధానంగా కర్ణునికి మిగిలిన కొండని అప్పగించాడట కృష్ణుడు. వెంటనే కర్ణుడు ప్రజలతో ఎవరికి ఎంత కావలిస్తే అంత పట్టుకుపొమ్మన్నాడట. కళ్ళముందే కొండ కరిగిపోయింది. అదీ దాన గుణం!
అలాగే తమిళనాడులో జయలలిత వస్త్రాలు, మందులు, తాగునీరు, కేబుల్ కనెక్షన్ ఆనక ‘ఇడ్లీ - ఉప్మా - పొంగల్’ మూడూ కలిపి అయిదు రూపాయలు; సాంబారు రైస్ - పులిహోర భోజనం ఏడున్నర రూపాయలు; పెరుగన్నం ఆరున్నర రూపాయలు; రెండు చపాతీ కూరతో ఏడున్నర రూపాయలకే అందజేస్తున్న జయలలిత ‘అమ్మ సాల్ట్’ పేరిట రూపాయికే శుద్ధి చేసిన ఉప్పు ప్యాకెట్!
- జయలలితను అనుకరించే ప్రయత్నంలో అర్జునుని వలె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం - గుంటూరు - తిరుపతి - అనంతపూర్; ఈ నాలుగు జిల్లాలలో 35 అన్నా క్యాంటీన్లు : విశాఖలో 15, గుంటూరులో 10, తిరుపతిలో 5, అనంతపూర్‌లో 5 ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని అనుకున్నారు. ఎన్టీఆర్ పేరుతో నిర్వహించే ఈ క్యాంటీన్లకు 35 కోట్ల బడ్జెట్ రూపొందించారు. చక్కటి పబ్లిసిటీ ఇచ్చారు. కానీ కార్యరూపం దాల్చలేదు. జేపులో ఎర్ర ఏగాని లేని ముఖ్యమంత్రి ప్రకటనలు బారెడు, ఆచరణ మూరెడు!