Advertisement
Google Ads BL

సినీజోష్‌ ఇంటర్వ్యూ: ‘జిల్‌’ హీరోయిన్‌ రాశి ఖన్నా


‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమై ఆ తర్వాత ‘జోరు’ చిత్రంతో హీరోయిన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ రాశి ఖన్నా. లేటెస్ట్‌గా యువి క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్న ‘జిల్‌’ చిత్రంలో హీరో గోపీచంద్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. మార్చి 27న ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అవుతున్న నేపథ్యంలో హీరోయిన్‌ రాశి ఖన్నాతో ‘సినీజోష్‌’ ఇంటర్వ్యూ.

Advertisement
CJ Advs

‘జిల్‌’లో మీ క్యారెక్టర్‌ ఎలా వుంటుంది?

ఇందులో నా క్యారెక్టర్‌ పేరు సావిత్రి. బబ్లీగా వుంటూ ఎంతో ఎనర్జిటిక్‌గా వుండే క్యారెక్టర్‌. సావిత్రికి, నాకు చాలా డిఫరెన్స్‌ వుంది. నేను మాత్రం సావిత్రిలా బబ్లీగా వుండలేను. మొదట ఈ క్యారెక్టర్‌ చెయ్యడానికి నేను చాలా భయపడ్డాను. తనకి నా నుంచి ఎలాంటి పెర్‌ఫార్మెన్స్‌ కావాలో రాధాకృష్ణగారికి క్లియర్‌గా తెలుసు. నాకు చాలా మంచి క్యారెక్టర్‌ ఇచ్చిన రాధాకృష్ణగారికి థాంక్స్‌. సాధారణంగా కమర్షియల్‌ మూవీస్‌లో హీరోయిన్స్‌ గ్లామర్‌కి మాత్రమే పరిమితమవుతారు. కానీ, ఈ సినిమా గ్లామర్‌ విషయం మర్చిపోతారు. సావిత్రి క్యారెక్టర్‌ని బాగా ఇష్టపడతారు. నా క్యారెక్టర్‌ని చాలా బాగా డిజైన్‌ చేశారు. నా కాస్ట్యూమ్స్‌గానీ బాడీ లాంగ్వేజ్‌గానీ డిఫరెంట్‌గా వుండేలా ప్లాన్‌ చేశారు. ఈ విషయంలో రాధాకృష్ణగారు చాలా కేర్‌ తీసుకున్నారు. 

ఈ సినిమాలో లిప్‌లాక్స్‌ వున్నాయా?

లిప్‌లాక్స్‌ ఇందులో లేవు. అయితే ఈ విషయాన్ని నేను, రాధాగారు చాలా పొయిటిక్‌గా ఆలోచించాం. ఆడియన్స్‌ తప్పకుండా అలా చూడాలని మాత్రం అనుకోలేదు. ఒక పొయిటిక్‌ ఫామ్‌లో వుండే లవ్‌నే ఈ సినిమాలో చూపించడం జరిగింది. నా విషయానికి వస్తే లిప్‌ లాక్‌ అనేది ఆ సిట్యుయేషన్‌కి అవసరం అంటే తప్పకుండా చేస్తాను. సినిమా చూస్తే లిప్‌లాక్‌ అనేది అవసరం లేదని మీరే చెప్తారు. 

గోపీచంద్‌తో కలిసి నటించడం ఎలా అనిపించింది?

గోపీచంద్‌ పెద్ద హీరో. ఆయనతో సినిమా చేస్తున్నాను అనుకోగానే కొంత నెర్వస్‌ ఫీల్‌ అయ్యాను. కానీ, ఆయన్ని కలిసిన తర్వాత చాలా హంబుల్‌ పర్సన్‌ అని అర్థమైంది. సెట్‌లో నేను చాలా కంఫర్టబుల్‌గా వుండడానికి చాలా హెల్ప్‌ చేశారు. అందుకే మా మధ్య సినిమాలో కెమెస్ట్రీ బాగా వర్కవుట్‌ అయింది. నన్ను ఎంతగానో ఎంకరేజ్‌ చేశారు. డాన్స్‌ విషయంలో కొన్ని స్టెప్స్‌ నాకు కష్టమనిపించినపుడు ఎలా చెయ్యాలి అనే టెక్నిక్‌ నాకు నేర్పించారు. ఏ హీరో అయినా అలా చెప్తారని అనుకోను. 

ఈ సినిమా మీరు ఓకే చెయ్యడానికి కారణం?

మెయిన్‌ రీజన్‌ స్క్రిప్ట్‌. స్క్రిప్ట్‌ నాకు బాగా నచ్చింది. స్టోరీ బ్రిలియంట్‌గా వుంది, నా క్యారెక్టర్‌ కూడా బ్రిలియంట్‌గా వుంది. అందుకే నేను రెండో క్వశ్చన్‌ లేకుండా ఈ సినిమా ఓకే చేశాను. నన్ను పాటల్లో అంత గ్లామరస్‌గా చూపిస్తారని నాకు మొదట తెలీదు. నా వరకు కథ, నా క్యారెక్టర్‌ బాగున్నాయి. అందుకే ఎంతో ఇష్టపడి ఈ సినిమా చేశాను. 

తెలుగు మాట్లాడం నేర్చుకున్నారు కదా! మరి డబ్బింగ్‌ చెప్పకపోవడానికి రీజన్‌?

నేను డబ్బింగ్‌ చెప్పాలి అనుకున్నాను. కానీ, కొన్ని తెలుగు పదాలు పలకడంలో నాకు కొంత ప్రాబ్లమ్‌ వుంది. మామూలుగా మాట్లాడగలను. డబ్బింగ్‌ విషయంలో ప్రొనౌన్సేషన్‌ సరిగ్గా లేకపోతే బాగుండదు కాబట్టి నేను చెప్పలేకపోయాను. 

అఖిల్‌ సినిమాలో మీరు స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్నారా?

ఈ న్యూస్‌ ఎలా వచ్చిందో నాకు మాత్రం తెలీదు. ఎందుకంటే ఈ విషయంలో నన్ను ఎవరూ అప్రోచ్‌ అవ్వలేదు. అది ఒక రూమర్‌ మాత్రమే. క్లియర్‌గా చెప్పాలంటే నాకు ఐటమ్‌ సాంగ్స్‌ చెయ్యడం ఇష్టంలేదు. ప్రస్తుతానికి కేమియోస్‌ వరకు చెయ్యగలను. ఫ్యూచర్‌లో ఐటమ్‌ సాంగ్స్‌ చేస్తానేమో చెప్పలేను గానీ ప్రస్తుతానికి మాత్రం ఆ ఆలోచన లేదు.

మీరు చేసిన మూడు సినిమాల్లో మీరు కంఫర్టబుల్‌గా ఫీల్‌ అయిన కోస్టార్‌?

నాగశౌర్యతో నేను కంఫర్టబుల్‌గా ఫీల్‌ అయ్యాను. ఎందుకంటే మాది సేమ్‌ ఏజ్‌ గ్రూప్‌ కావడం వల్ల కావచ్చు. ఒకేసారి కెరీర్‌ స్టార్ట్‌ చెయ్యడం కావచ్చు. 

మీ కెరీర్‌కి ఈ సినిమా ఎలాంటి హెల్ప్‌ అవుతుందనుకుంటున్నారు?

ఇప్పటివరకు నేను చేసిన క్యారెక్టర్స్‌కి డిఫరెంట్‌గా వుంటుంది. ఇందులో నన్ను గ్లామరస్‌గా చూపించడమే కాకుండా మంచి పెర్‌ఫార్మెన్స్‌ కూడా చేయించారు. తప్పకుండా ఇకముందు చేయబోయే సినిమాలకు ‘జిల్‌’ చాలా హెల్ప్‌ అవుతుంది అంటూ ఇంటర్వ్యూ ముగించారు రాశి ఖన్నా.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs