గుణశేఖర్ ఆశ - శ్వాస ‘‘రుద్రమదేవి’’. ఈ సినిమా తాలూకు మూడు పాటలను విశాఖలో, మరో మూడు పాటలను వరంగల్‌లో విడుదలచేశారు. అనుష్క, రానా, అల్లు అర్జున్. నిత్యామీనన్ వంటి స్టార్ గ్లామర్‌వున్న ఈ చిత్రానికి ఇళయరాజా, అజయ్‌విన్సెంట్, పరుచూరి బ్రదర్స్, సిరివెన్నెల తదితర హేమాహేమీలు పనిచేశారు. ఈ సినిమా విశాఖ ఆడియో రిలీజు ఫంక్షన్‌కి ప్రేక్షకులు అరకొరగా కనిపించగా వరంగల్ ఫంక్షన్‌లో నేలంతా ప్రేక్షకులతో నిండిపోయింది. విశాఖలో సముద్రం కనిపిస్తే వరంగల్‌లో జనసముద్రం కనిపించింది.
ఇది కాకతీయుల పౌరుషం; ఓరుగల్లు చరిత్ర; చరిత్ర పుటలలో రక్తసిక్తమయిన తెలంగాణ ఘన చరిత్ర! గుండె ధైర్యం - తనపై తనకున్న అపార నమ్మకం - అనుష్క, అల్లు అర్జున్, రానా, దిల్‌రాజు అందించిన సహకారంతో ఓ రచయిత నిర్మాతగా దర్శకుడుగా అందించిన భారీ బడ్జెట్ చిత్రం!
ఈ సినిమా ఆడియో రిలీజు సందర్భంగా తెలంగాణలో జనసంద్రాన్ని- విశాఖలో జనాన్ని చూసి ఓ సినీ ప్రముఖుని వ్యాఖ్య : ‘‘ఇది తెలంగాణ సినిమాగా చరిత్ర సృష్టిస్తుందేమో?’’
తెలంగాణ సాయుధ పోరాటం నేపధ్యంగా ‘‘మా భూమి’’ నిర్మించి 35 ఏళ్ళయింది; యాదృశ్ఛికంగా ఇదే సమయంలో ‘‘రుద్రమదేవి’’ ఆడియో రిలీజయింది!!