తెలంగాణ - సినిమాటోగ్రఫీ మినిస్టర్ - తలసాని శ్రీనివాసయాదవ్‌తో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఇంటరాక్టివ్ మీటింగ్ జరిగింది. చిన్న సినిమా నిర్మాతలు తమ సమస్యలను సూటిగా చెప్పలేకపోయారు, ‘మంత్రితో సమావేశం’ అన్నప్పుడు ఎవరెవరు ఏం మాట్లాడాలి? అన్న విషయమై సరైన హోంవర్కు జరగలేదు. తలా ఒక మాట మాట్లాడారు.
హైదరాబాదులో చిత్ర పరిశ్రమ మనుగడ - అభివృద్ధి ముఖ్యమా?
లేక తెలంగాణ సినిమా పరిశ్రమ అభివృద్ధి ముఖ్యమా?
- అన్నది ముందుగా నిర్ణయం కావాలి.
నవ్యాంధ్ర పునర్నిర్మాణంలో సినిమా పరిశ్రమకి చంద్రబాబు పెద్దపీట వేయడం ఖాయం. సినిమా పరిశ్రమ ఎక్కడ వుంటే అక్కడ కళలు అభివృద్ధి చెందుతాయి - గ్లామర్ కనిపిస్తుంది - రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది - పలు అనుబంధ సంస్థలు వెలువడతాయి - ఉపాధి దొరుకుతుంది - టూరిజం, హోటల్, ఫుడ్, షాపింగ్ మెరుగుపడతాయి.
చిన్న సినిమాని బతికించుకోవడం, తెలంగాణ వారు నటించిన / నిర్మించిన సినిమాలను ప్రమోట్ చేసుకోవడం ఒకటి కాదు. ఈ రెంటిలో దేనిగురించి మాట్లాడాలో ముందుగా నిర్ణయం తీసుకోవడం మంచిది.