Advertisement
Google Ads BL

ఏపీలో కొత్త పరిశ్రమలకి వామపక్షాలు, జగన్‌ల దెబ్బ!


ఆంధ్రాలో కొత్త పరిశ్రమలని వామపక్షాలు, జగన్‌ దెబ్బ తీస్తున్నారు!

Advertisement
CJ Advs

మమతా బెనర్జీ పుణ్యమా అని టాటా మోటార్స్‌ ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్‌నుంచి గుజరాత్‌ తరలిపోయాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి దాపురించింది.

నవ్యాంధ్రలో పరిశ్రమలు పెట్టండి మహాప్రభో అని పారిశ్రామికవేత్తలను ప్రాధేయపడుతున్నారు లోటు బడ్జెట్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు.  ఇదే సమయంలో తెలంగాణలో వున్న ప్రాజెక్టులు తరలిపోకుండా రానున్న కొత్త ప్రాజెక్టులను ఆంధ్రా సిఎం చంద్రబాబు ఎగరేసుకుపోకుండా పట్టుబిగిస్తున్నారు  కెసిఆర్‌ - కెటిఆర్‌ అండ్‌ కో,. ఇదే సమయంలో నవ్యాంధ్ర రాజధాని భూసేకరణ విషయమై వామపక్షాలు, జగన్‌ ఉద్యమించడం ఆంధ్రాలో కొత్త పరిశ్రమలు స్థాపించే ఆలోచనలోనున్న పారిశ్రామికవేత్తలను పునరాలోచనలో పడేసింది. ఓవైపు లోటుబడ్జెట్‌ - అరకొర కేంద్ర సాయం - భూ సేకరణ విషయమై వామపక్షాల తకరారు - నీటి ప్రాజెక్టుల విషయమై జగన్‌ అసెంబ్లీ బహిష్కరణ కొత్త పరిశ్రమల స్థాపనపై అనుమానపు నీలి మేఘాలను వ్యాపింపజేశాయి. ఆంధ్రాకన్నా మిగులు బడ్జెట్‌ వున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎక్కువ సౌకర్యాలు కల్పించడం, చంద్రబాబుని ఇంటి సమస్యలు ముట్టడిరచడం - ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సమస్యల స్థాపన ప్రశ్నార్ధకం కానున్నది. నాడు జగ్‌ సృష్టించిన అలజడివల్లనే రాష్ట్ర విభజనకు సోనియా తొందరపడిరది. నేడు జగన్‌ సృష్టిస్తున్న అల్లకల్లోలంవలనే పారిశ్రామికవేత్తలు ఆంధ్రాలో పరిశ్రమల స్థాపనకు పునరాలోచనలో పడుతున్నారు!

- తోటకూర రఘు

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs