కేంద్రమంత్రి పదవి దక్కించుకున్న ఆంధ్రులకోడలు - నిర్మలా సీతారామన్‌ని చూసి తెలుగువారు ముచ్చటపడ్డారు; రాజ్యసభ స్థానాన్ని తాంబూలంతో సమర్పించుకున్నారు; ఆమె భర్త ప్రభాకర్‌కి కేబినెట్ హోదా కల్పించారు. కానీ టొబాకో బోర్డు మెంబరుగా జాస్తి రమేష్‌ని కొనసాగించమన్న ఆంధ్ర ఎంపీల అభ్యర్ధనని ‘ఫైలు పిఎమ్‌ఓకి వెళ్ళింది’ అన్న సాకుతో పక్కనపెట్టిన నిర్మలా సీతారామన్, ‘లేదు మేడమ్, ఫైలు మీ పేషీలోనే వుంది’ అన్న ఎంపీల అభ్యర్ధనని సున్నితంగా ‘చూస్తాను’ అని దాటేయకుండా, ‘నా పేషీలోనే గూఢచర్యం చేస్తారా? ఆ రమేష్‌కి పొగాకు బోర్డులోనే కాదు ఏ బోర్డులోనూ మెంబరుషిప్ రాకుండా చూస్తా - అని రుసరుసలాడటం ఆంధ్రుల మనోభావాలను గాయపర్చింది. తెలుగుజాతి అభిమానం దెబ్బతిన్నది. ఆమె మాటల ప్రభావం ‘బిజెపి - టిడిపి’ సంబంధాన్ని దెబ్బ తీసేలా వుంది.
- తోటకూర రఘు
Advertisement
CJ Advs