Advertisement
Google Ads BL

జగన్‌ బొక్కబోర్లా పడ్డాడు..!!


ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ ఎత్తుగడల్లో చతికిలపడిపోయారనే వాదనలు వినబడుతున్నాయి. అధికారపక్షాన్ని నిలదీసేందుకు సరైన వేదికైన అసెంబ్లీలో ఆవేశానికిపోయి జగన్‌మోహన్‌రెడ్డి అసలుకే ఎసరు తెచ్చుకుంటున్నాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాలను జగన్‌మోహన్‌రెడ్డి బాయ్‌కాట్‌ చేశారు. ఇక ఆయన బయటకు వచ్చి పలు సమస్యలపై ఆరు గంటలు, అర్ధరోజు, ఒక్కరోజు నిరాహార దీక్షలు చేసినా జనం పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఇక ఆయన కలెక్టరేట్ల ముట్టడి తదితర కార్యక్రమాలకు పిలుపునిచ్చినా ఆయన పార్టీ నాయకులే రావడం లేదు. ఒక్క 'సాక్షి' మీడియా తప్పించి మిగితా చానళ్లన్నీ కూడా జగన్‌ కార్యక్రమాలకు ప్రాధాన్యత తగ్గించాయి. ఈ సమయంలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం తప్పులను జగన్‌ గట్టిగా నిలదీస్తారని, ప్రజల మద్దతు పొందుతారని అందరూ భావించారు. అసెంబ్లీ సమావేశాలను అన్ని వర్గాల మీడియా తప్పనిసరిగా కవర్‌ చేస్తుంది కాబట్టి జగన్‌కు కావాల్సినంత పబ్లిసిటీ కూడా దొరుకుతుందని వైసీపీ నాయకులు ఆశించారు. అయితే జగన్‌ మాత్రం ఏకంగా స్పీకర్‌పైనే అలిగి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. స్పీకర్‌ తగిన సమయం ఇవ్వకుంటే జగన్‌ ఇతర విధానాల్లో నిరసన తెలిపి ఉండాల్సిందని, ఇప్పుడు సమావేశాలను బాయ్‌కాట్‌ చేయడంతో ప్రజాసమస్యలను ప్రశ్నించే వారే కరువయ్యారు. ఈ పద్ధతి వైసీపీ అభిమానులను కూడా జగన్‌కు దూరంచేసే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs