Advertisement
Google Ads BL

కవలపిల్లలకి లవకుశులు!


ఒకే కాన్పులో ఇద్దరు పిల్లలు పుడితే ‘కవలలు’ అని, ఇద్దరూ అబ్బాయిలయితే ‘లవకుశులు’ లేదా ‘రామలక్ష్మణులు’ అని పేరు పెట్టుకుంటారు. తెలుగు తల్లికి ‘ఆంధ్ర - తెలంగాణ’ కవలలు! అలాగే తెలంగాణ సినీ కళామతల్లికి కవలలు : ‘తెలంగాణ మూవీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ - తెలంగాణ స్టేట్‌ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’.

Advertisement
CJ Advs

చిత్రమేమంటే, ‘తెలంగాణ మూవీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’ అధ్యక్షుడుగా ప్రకటింపబడిన దిల్‌రాజుకి ఈ విషయం తెలియదట! అలాగే ‘తెలంగాణ స్టేట్‌ ఫిలిమ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న విజయేంద్రరెడ్డి ‘తెలంగాణ మూవీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’ ఉపాధ్యక్షునిగా ఎంపికయిన విషయమూ ఆయనకు తెలియదట!

‘తెలంగాణ గడ్డపై పుట్టిన వారికే ఈ సంస్థలో సభ్యత్వం’ అన్న విషయమై స్పష్టత ఇవ్వవలసింది తెలంగాణ ప్రభుత్వమేనని ముక్తాయించారు విజయేంద్ర రెడ్డి!

- ఈ తిరకాసేమిటో విప్పి చెప్పాల్సింది తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ తలసాని శ్రీనివాస యాదవ్‌ మాత్రమే! 

కన్నడ సినిమా తీసిన తెలుగు నిర్మాతలకి కర్ణాటక ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో సభ్యత్వం వుంది. తెలంగాణలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి సభ్యత్వ అర్హత ఓ సమస్య కాకూడదు.

-తోటకూర రఘు

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs