Advertisement
Google Ads BL

దాసరి - చిరంజీవి ఒకటవుతారా?


అల్లువారున్నంతకాలం దాసరి - అల్లు : పాలకొల్లు పొత్తు : పండుగలు పబ్బాలవరకు సాగింది. చిరంజీవి ఇంటి వారమ్మాయి దాసరి ఇంటివారబ్బాయి (కెమెరామన్‌ హరి) చుట్టరికం కూడా కలిసింది. తెలుగు సినీ సీమలో కృష్ణుడుగా ఎన్టీఆర్‌ని మినహా మరొకర్ని ఊహించలేని స్థితిలో దాసరి - అల్లువారు రామకృష్ణని కృష్ణుడుగా చూపించారు. కారణం - కృష్ణుడు గెటప్‌లో ఎన్టీఆర్‌ కాఫీ తాగడాన్ని ప్రేక్షకులు అంగీకరించరని! ఈ సినిమా ‘‘దేవుడే దిగివస్తే’’ 1975లో విడుదలయింది. దీనికి ముందు ‘‘బంట్రోతు భార్య’’ 1974లో వచ్చింది. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు రామలింగయ్య సమర్పించిన ఈ రెండు చిత్రాలకు నిర్మాత అల్లు అరవింద్‌, దర్శకుడు దాసరి నారాయణరావు. ఈ రెండు చిత్రాలూ సూపర్‌ హిట్‌.

Advertisement
CJ Advs

తెలుగు సినీ పరిశ్రమలో ‘దాసరి లెగసీ’ నడుస్తున్నా ‘మెగాస్టార్‌’గా ఎదిగిన చిరంజీవి ఒకే ఒక సినిమాకి కలిసి పనిచేశారు. ఆ సినిమా ‘‘లంకేశ్వరుడు’’. కారణాలు ఏమయితేనేం దాసరి - చిరంజీవి కాంబినేషన్‌ కంటిన్యూకాలేదు. ఇద్దరూ కాంగ్రెసు పార్టీ - రాజ్యసభ సభ్యులయినా, ఇద్దరూ మన్మోహన్‌సింగ్‌ మంత్రివర్గంలో మంత్రులుగా ఒకరితర్వాత మరొకరు పనిచేసినా ఇద్దరూ ఒకే వేదికను పంచుకోలేదు. ఈ నేపధ్యంలో హఠాత్తుగా దాసరి పవన్‌కళ్యాణ్‌తో సినిమా ప్రకటించడం, బన్నీ - త్రివిక్రమ శ్రీనివాస్‌ ‘‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’’ సినిమా ఆడియో ఫంక్షన్‌కి దాసరి ముఖ్య అతిధిగా రావడం - ఆ సభలో తెలుగు సినిమా హీరోలలో ఓ స్టైల్‌ వున్న నటుడు ‘పవన్‌ కళ్యాణ్‌’ అని ప్రశంసిస్తూ, పవన్‌ని అనుకరించని తారగా బన్నీని పొగడ్తలతో ఎత్తేయడం సినీ - రాజకీయ పండితుల ఆలోచనలకు పదునుపెట్టింది. పవన్‌కళ్యాణ్‌  పొలిటికల్‌ రోడ్‌మ్యాప్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయని; దాసరి - చిరంజీవి - పవన్‌ కళ్యాణ్‌ - బన్నీ - రామ్‌ చరణ్‌ -సాయిధరమ్‌తేజ్‌ ఒకే వేదికపై కనిపిస్తే ఆ మజా వేరని అంటున్నాయి రాజకీయ విశ్లేషణలు! 

                                                                               - తోటకూర రఘు

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs