Advertisement
Google Ads BL

ప్రపంచ భాష ‘ఉర్దూ’ తెలంగాణలో సెకండ్‌ లాంగ్వేజ్‌!


ప్రపంచ భాష ‘ఉర్దూ’ తెలంగాణలో సెకండ్‌ లాంగ్వేజ్‌!

Advertisement
CJ Advs

‘సినీజోష్‌’ ఆశ - శ్వాస ఆచరణలోకి వస్తోంది!

ప్రపంచ భాష ఇంగ్లీషు తర్వాత, అత్యంత ప్రాచుర్యంపొందిన భాష ఉర్దూ మాత్రమే! మతపరంగా ప్రపంచ జనాభాలో అత్యధికులు క్రిస్టియన్లు - ముస్లిమ్‌లు మాత్రమే! బైబిల్‌ - ఖురాన్‌ ప్రతుల ప్రచురణ చూస్తే తెలుస్తుంది, భాషల పాపులారిటీ. అమెరికా - ఆస్ట్రేలియా - ఇంగ్లాండ్‌ - తైవాన్‌ - సింగపూర్‌ తదితర దేశాలలో ఉద్యోగం చేయాలంటే ఇంగ్లీషు వచ్చి తీరాలి, ముస్లిమ్‌ దేశాలలో రాణించాలంటే ‘ఉర్దూ’ తెలిసి వుండాలి. సంస్కృతాన్ని నిర్బంధ విద్యగా ప్రవేశపెట్టాలని; జపనీస్‌ భాషని సెకండ్‌ లాంగ్వేజ్‌గా తొలగించాలని కేంద్రస్థాయిలో ప్రతిపాదన వచ్చినప్పుడు ఘాటుగా స్పందించింది ‘సినీజోష్‌’ మాత్రమే. ప్రపంచంలో / భారత దేశంలో సంస్కృతంలో మాట్లాడుకునే వారి సంఖ్య ఎంతో చెప్పగలరా? అని సవాలు విసిరిందీ ‘సినీజోష్‌’ మాత్రమే. భారతీయుడు ప్రపంచ పౌరుడు. ఎక్కడ ఉపాధి, వ్యాపార, శాస్త్ర పరిశోధనలకు అవకాశం వుందో అక్కడ భారతీయుడు ప్రత్యక్షమవుతాడు. కారణం - ప్రపంచ భాషలలో భారతీయునికి వున్న ప్రావీణ్యం. ఎంతో ఎందుకు, హైదరాబాదులో తెలుగు -ఉర్దూ / హిందీ - ఉర్దూ ‘మిక్స్‌’ వినిపిస్తుంది. ఆంధ్ర - తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర నాయకులను తెలంగాణవారు ప్రభావితం చేయడానికి, సీమాంధ్రులు బేలగా మిగిలిపోవడానికి కారణం : హిందీ ` ఉర్దూ భాషా ప్రభావం. కేంద్ర నాయకులకు హిందీ ` ఉర్దూ అర్ధమయినట్లుగా ఇంగ్లీషు అర్ధంకాదు. సీమాంధ్రులు తెలుగు ` ఇంగ్లీషు మాత్రమే మాట్లాడగలరు- హిందీ - ఉర్దూ భాషలలో మాట్లాడలేరు. దాశరధి, సినారె రచనలపై ఉర్దూ ప్రభావాన్ని చూస్తాం. వెంకయ్యనాయుడు జాతీయ నాయకునిగా ఎదగటానికి ఆయనకున్న హిందీ భాషా పాండిత్యమని విస్పష్టంగా చెబుతాం. అదీ భాషా ప్రాభవం. జీతాలను, జీవితాన్ని ఇచ్చే ‘ఉర్దూ’ భాషను ప్రోత్సహించాలా? సంస్కృతాన్ని నెత్తినరుద్దాలా? అన్న ప్రశ్న ఎదురయినప్పుడు తెలంగాణ సర్కారు ‘ఉర్దూ’ భాషనే ఎంచుకోజూడటం అభినందనీయం. దీర్ఘకాలిక ప్రయోజనాలనాశించిన నాయకుడుగా కెసిఆర్‌ నిర్ణయం ప్రశంసనీయం. సెకండ్‌ లాంగ్వేజ్‌గా ‘ఉర్దూ’ అన్న అభిప్రాయాన్ని ‘సినీజోష్‌’ 23 జూన్ 2014 తేదీన వెలిబుచ్చిందని సగర్వంగా చెప్పుకుంటున్నాం.

-తోటకూర రఘు

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs