పార్ట్ 2
పవన్‌కళ్యాణ్ గారూ మీరూ చంద్రబాబుని ఇంతకాలం ఎలా సమర్ధించారు?
చంద్రబాబుకి ఆంధ్ర ప్రజలు ముఖ్యమా - తెలంగాణలో పార్టీ ముఖ్యమా?
రాష్ట్ర విభజన చట్టలంలో విద్య - ఉపాధి గురించి స్పష్టత వుంది. ఉదాహరణకు ‘ఎంసెట్’ తీసుకోండి. మెడికల్ ` ఇంజినీరింగ్ సీట్లకు ఎంసెట్ మార్కులతోపాటు, ఇంటర్ మార్కులకీ వెయిటేజీ వుంది. ఇంటర్ పరీక్షలను ఉమ్మడిగా కాక వేర్వేరుగా నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ అంగీకరించినప్పుడే ఎంసెట్ ఉమ్మడిగా నిర్వహించాలన్న వాదనకి విలువలేకుండా పోయింది. రెండేళ్ళ ఇంటర్ విద్యారంగంలో నిష్ణాతుడయిన నారాయణగారు కేబినేట్ మంత్రిగా వుండగా ఇంటర్ పరీక్షలు వేర్వేరుగా నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా అంగీకరించింది? ముందుచూపులేకుండా ఇంటర్ పరీక్షలకి అంగీకరించి ఎంసెట్ దగ్గర ఆఖరి క్షణంలో తకరారుకి దిగింది. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా!
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకోసం కెసిఆర్ మాట్లాడినంత గట్టిగా ఆంధ్ర ప్రయోజనాలకోసం చంద్రబాబు మాట్లాడుతున్నారా? కెసిఆర్ తెలంగాణలో పర్యటిస్తున్నారు -సుపరిపాలనకోసం. చంద్రబాబు తెలంగాణలో ఎందుకు పర్యటిస్తున్నారు? ఆంధ్రలో సమస్యలు లేవా? చంద్రబాబుకి ఆంధ్రా ప్రజలు ముఖ్యమా - తెలంగాణలో పార్టీ ముఖ్యమా?
హైదరాబాద్ నుంచి తెలుగు సినిమా పరిశ్రమ తరలిపోకుండా కెసిఆర్ చేస్తున్న కృషిని మీరు గమనిస్తూనే వున్నారు. ఆధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమ మనుగడకు ఒక రోడ్ మ్యాప్ తయారుచేసే బాధ్యతని చంద్రబాబు ఎవరికైనా అప్పగించారా? కనీసం సినీ పెద్దలనయినా సమావేశపరిచారా? సినీ పరిశ్రమ విషయంలోనే ఇంతగా నిమ్మకు నీరెత్తినట్లున్నచంద్రబాబు ఇతర పరిశ్రమలను అభివృద్ధి చేయడంలో ఎంతగా దూసుకుపోగలరో గ్రహించవచ్చు. ఆంధ్రలోని పత్రికలు చూస్తే ప్రామిస్‌లు కనిపిస్తున్నాయి, తెలంగాణ పత్రికలు చూస్తుంటే ప్రాజెక్టులు కనిపిస్తున్నాయి.
అయినా మీరూ చంద్రబాబునే ఇంతకాలం ఎందుకు వెనకేసుకొచ్చారు?
(మరికొంత మూడో భాగంలో)