ఓ వైపు హాలీవుడ్ ` బాలీవుడ్ చిత్రాల స్థాయిలో ‘‘బాహుబలి, రాణీ రుద్రమదేవి’’- మరోవైపు ‘రన్ రాజా రన్, మిధునం, ఓనమాలు’ ఇంకోవైపు ‘రేసు గుర్రం, టెంపర్, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, కార్తికేయ’ వంటి బ్లాక్ బస్టర్స్ : దాసరి నారాయణరావు ఈసారి తన 152వ చిత్రంగా పవన్ కళ్యాణ్‌తో సినిమా-
పవన్ కళ్యాణ్ సొంత నిర్మాణ సంస్థ తొలి చిత్రం హీరో రామ్‌చరణ్-
హీరో నితిన్ సొంత నిర్మాణ సంస్థ అఖిల్‌ని హీరోగా పరిచయం చేయడం-
కెఎస్ ప్రకాశరావు - ఒకనాటి తెలుగు సినిమా దిగ్గజం- ఆయన పేరు పెట్టుకున్న ఆయన మనవడు దర్శకుడు కె.రాఘవేంద్రరావు కుమారుడు - కోవెలమూడి ప్రకాష్ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం ఆరంభం : ఈ చిత్రంలో అనుష్క ప్రధాన పాత్ర పోషించడం- క్రిష్ సంభాషణలు రాయడం.
తెలుగు సినిమాలో మున్నెన్నడూలేని వైవిధ్యం- అంతకుమించిన సామరస్యం - స్నేహభావం -వ్యాపార దృక్పధం ముచ్చటగొలుపుతోంది. నా వయసింకా పదహారేళ్ళే అన్నట్టు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ నటనకు, సినీ పరిశ్రమకు సేవచేయాలన్న దృక్పధంతో పునరంకితం కావడం- నటి దర్శకురాలు జీవిత నేషనల్ ఫిలిమ్ సెన్సారు సభ్యురాలుగా బాధ్యతలు స్వీకరించడం- రాజశేఖర్ ‘గడ్డం గ్యాంగ్’ తో చాలాకాలం తర్వాత మళ్ళీ తెరపై కనిపించడం ఆనందంగా వుంది.
నిన్న మొన్నటివరకు ఆంధ్రా - తెలంగాణ, రాష్ట్ర విభజన సినిమా పరిశ్రమ సంస్ధాగతంగా కూడా రెండుగా చీలే ప్రమాదం పొంచివుంది. కెసిఆర్ పెద్ద మనసుతో రామానాయుడి అంతిమక్రియల్లో స్టేట్ ఆనర్ ఇచ్చారు. ప్రస్తుతం సినీ వాతావరణం ఆహ్లాదకరంగా వుంది- స్వర్ణయుగంలో వున్నట్టుంది.
- తోటకూర రఘు