Advertisement
Google Ads BL

సినీజోష్‌ ఇంటర్వ్యూ: దాసరి కిరణ్‌కుమార్‌


రామధూత క్రియేషన్స్‌ పతాకంపై మొదటి ప్రయత్నంగా ఓంకార్‌ దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్‌ నిర్మించిన ‘జీనియస్‌’ సక్సెస్‌ఫుల్‌ మూవీగా అందరి ప్రశంసలు అందుకుంది. ఈ బేనర్‌పై రెండో చిత్రంగా హవీష్‌ హీరోగా శ్రీపురం కిరణ్‌ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘రామ్‌లీల’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 27న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌తో ‘సినీజోష్‌’ ఇంటర్వ్యూ.

Advertisement
CJ Advs

మీ బేనర్‌లో వస్తోన్న రెండో సినిమా ‘రామ్‌లీల’ ఎలా వుండబోతోంది?

ఒక సోషల్‌ మెసేజ్‌తో ఓంకార్‌ని దర్శకుడుగా పరిచయం చేస్తూ హవీష్‌ హీరోగా నిర్మించిన ‘జీనియస్‌’ అంచనాలకు మించి విజయం సాధించింది. ఆ సినిమా ఓవర్‌ బడ్జెట్‌ అయినప్పటికీ మేం అనుకున్నదాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి అనేది ఆలోచించి నిజాయితీగా చెయ్యడం జరిగింది. ఆ సినిమా తర్వాత నేను రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌లో బిజీగా వుండడంవల్ల రెండు సంవత్సరాలు గ్యాప్‌ వచ్చింది. ఒక మంచి కథ దొరకగానే ఈ సినిమా స్టార్ట్‌ చెయ్యడం జరిగింది. అయితే మా గత చిత్రానికి జరిగిన పొరపాటు జరగకుండా 36 రోజుల్లో సినిమాని కంప్లీట్‌ చేసి ఓవర్‌ బడ్జెట్‌ అవకుండా అనుకున్న టైమ్‌కి రిలీజ్‌ చేస్తున్నాం. దానికి ముఖ్య కారణం గోపాలరెడ్డిగారు, హీరో హవీష్‌, నందిత. వారు చెప్పిన డేట్స్‌ ఎక్కడా మిస్‌ అవకుండా కరెక్ట్‌గా ఇవ్వడం వల్ల టైమ్‌కి సినిమాని కంప్లీట్‌ చెయ్యగలిగాం. గోపాలరెడ్డిగారులాంటి సీనియర్‌ టెక్నీషియన్‌ ఇది తన సొంత సినిమాగా భావించి చెయ్యడంవల్ల అనుకున్న టైమ్‌లో పూర్తి చేయగలిగాం. జీనియస్‌తో మంచి టేస్ట్‌ వున్న ప్రొడ్యూసర్‌గా నాకంటూ ఒక మంచి పేరు సంపాదించుకోగలిగాను. ఆ పేరు పోగొట్టుకోకుండా ఒక మంచి కథతో చేస్తున్న సినిమా ‘రామ్‌లీల’. సెన్సార్‌ ఆఫీసర్‌ కూడా ఒక కొత్త లైన్‌తో సినిమా తీశారు. గుడ్‌లక్‌ అని అప్రిషియేట్‌ చేశారు. 

గోపాలరెడ్డిలాంటి సీనియర్‌ టెక్నీషియన్‌ మీ సినిమాకి ఏవిధంగా హెల్ప్‌ అయ్యారు?

‘శివ’ నుంచి ఇప్పటివరకు ఆయన ఎన్నో గొప్ప సినిమాలకు ఫోటోగ్రఫీ అందించారు. అలాంటి సీనియర్‌ టెక్నీషియన్‌కి కథ నచ్చి మా సినిమా టేకప్‌ చెయ్యడమే మా ఫస్ట్‌ సక్సెస్‌గా భావిస్తున్నాను. నువ్విలా, జీనియస్‌ చిత్రాల తర్వాత హవీష్‌ చేస్తున్న సినిమా ఇది. ఒక అప్‌కమింగ్‌ హీరో సినిమాకి గోపాలరెడ్డిగారులాంటి టెక్నీషియన్‌ వర్క్‌ చేయడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ సినిమాలో విజువల్స్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా తీశారు. కథే హీరో అని నమ్మే టెక్నీషియన్‌ ఆయన. దానికి డైరెక్టర్‌ కిరణ్‌తో  కోఆర్డినేట్‌ చేసుకొని కొన్ని సలహాలు కూడా ఇచ్చి ఔట్‌పుట్‌ బాగా రావడానికి తోడ్పడ్డారు. ఈ సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 

మెయిన్‌ ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌ గురించి?

హవీష్‌ ఆల్‌ షేడ్స్‌ వున్న క్యారెక్టర్‌ చేశాడు. డాన్స్‌, ఫైట్స్‌, కామెడీ, క్లైమాక్స్‌లో తన తండ్రితో, లవర్‌తో చేసే కొన్ని సీన్స్‌లో అద్భుతంగా చేశాడు. పెర్‌ఫార్మెన్స్‌ పరంగా వందకి వంద మార్కులు సంపాదించుకుంటాడు. ఒక మెచ్యూర్డ్‌ హీరోగా పేరు తెచ్చుకుంటాడన్న నమ్మకం నాకు వుంది. నందిత గురించి చెప్పాలంటే తనకి మొదటి సినిమా, రెండో సినిమా పెద్ద హిట్‌ అయ్యాయి. ఈ సినిమాతో నందిత హండ్రెడ్‌ పర్సెంట్‌ హ్యాట్రిక్‌ కొడుతుంది. అభిజీత్‌ ఫస్ట్‌ మూవీ ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’. ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరికీ దగ్గరైన వ్యక్తి. ఈ సినిమాలో సెకండాఫ్‌లో వచ్చే 10 నిముషాల సీన్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా చేశాడు. అతని లైఫ్‌లో దానికి మించి  పెర్‌ఫార్మ్‌ చెయ్యాలంటే ఎంతో కష్టపడాలి. ఇది మలేషియాలోని కుమారస్వామి విగ్రహం దగ్గర చెయ్యడం జరిగింది.

ఎన్ని థియేటర్స్‌లో రిలీజ్‌ చేస్తున్నారు?

వరల్డ్‌వైడ్‌గా 300 థియేటర్స్‌లో రిలీజ్‌ చేస్తున్నాం. జీనియస్‌ 203 థియేటర్స్‌లో రిలీజ్‌ చేస్తే ఈ సినిమాకి మరో 100 థియేటర్లు పెంచాం. మా బేనర్‌లో వస్తోన్న ఈ రెండో సినిమా ‘రామ్‌లీల’ తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకంతో వున్నాం అంటూ ఇంటర్వ్యూ ముగించారు నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs