Advertisement
Google Ads BL

దాశరధి, సినారె, శ్రీరమణ, ఇంద్రగంటి ల ఊసేది ?


దాశరధి రంగాచార్య ... సినారె ... శ్రీరమణ ... ఇంద్రగంటి తదితరుల ఊసేది?

Advertisement
CJ Advs

కవిసమ్రాట్‌ విశ్వనాధ వారి లోగిలిలో జరుగుతున్న ప్రపంచ మూడవ తెలుగు రచయితల మహాసభల సందర్భంగా తాళపత్ర పేటికల స్థానంలో తరతరాల తెలుగు సాహిత్యాన్ని అందుబాటు ధరలలో (సబ్సిడీ ధరలకి) తెలుగు పాఠకులకు అందిస్తే బాగుండేది. గొప్పగొప్ప రచయితల రచనలను ప్రచురించే ప్రచురణకర్తలు, అంత ఖర్చుపెట్టి కొనగల పాఠకులు తగ్గిపోయారు. డిజిటల్‌ యుగంలో ఎలక్ట్రానిక్‌ మీడియాతో ప్రింట్‌ మీడియా పోటీపడాలంటే తెలుగు ప్రచురణలకు ప్రభుత్వ ప్రోత్సాహం అందాలి. దాశరధి రంగాచార్య ... సినారె... శ్రీరమణ... ఇంద్రగంటి తదితర మహామహులను రేపటి తరానికి పరిచయం చేయాలి. తెలుగు విజ్ఞాన వికాస భాండాగారం అనదగిన ఈ మహామహులను, వారి రచనలను పరిచయం చేయండి. ప్రతి స్కూలులో, కాలేజీలలో, యూనివర్శిటీలలో జరిగే వేడుకలకి వీరిని విశిష్ట అతిధులుగా ఆహ్వానించండి. తెలుగువాడి సొత్తు అయిన ‘పద్య నాటకం’ వలె, తెలుగు రచనలకూ కాలంచెల్లే ప్రమాదం పొంచివుంది. తస్మాత్‌ జాగ్రత్త!!

-తోటకూర రఘు

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs