సినిమా పరిశ్రమలో జయాపజయాలు సహజం. కానీ ఆఫీసు పనివేళలు వలె సినిమా షూటింగులో ‘టైమింగ్’ ఫాలో అయింది రామోజీరావు గారు, రామానాయుడుగారే. తొలిదినాలలో ఎన్టీఆర్, అక్కినేని వంటి క్రమశిక్షణ గల టాప్ స్టార్స్‌తో పనిచేయడంవలన నాయుడుగారికి ప్రొడక్షన్‌మీద ‘గ్రిప్’ వచ్చింది.
పౌరాణికాలు, సాంఘికాలు, జానపదాలు, హీరో హీరోయిన్ల ఫాలోయింగ్ : మార్కెట్ ట్రెండ్‌కి అనుకూలంగా కమ్మర్షియల్ సినిమాలు తీస్తూనే సామాజిక స్పృహ గల సినిమాలూ తీశారు. ‘అంధత్వం’ నేపధ్యంగా భారతీయ భాషలలో చాలా సినిమాలొచ్చాయి. కానీ ‘ప్రేమించు’ సినిమాలో చక్కటి ఎమోషనల్ ఫ్యామ్లీ డ్రామా ‘బ్రెయిలీ లిపి’ ఆవశ్యకతని గొప్పగా చూపించారు.
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సూచనమేరకు ఓ లీడింగ్ తెలుగు డెయిలీని టేకోవర్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. తనకు తెలియని ఆ పత్రికా ప్రపంచం గురించి తెలుసుకోవడానికి ఆయన తన సామాజిక వర్గానికి చెందిన మరో లీడింగ్ తెలుగు డైలీ అధినేతను సంప్రదించారు. ఈ పోటీ ప్రపంచంలో ప్రత్యర్ధి సలహా తీసుకునే పారదర్శకత ఒక్క నాయుడు గారిలోనే కనిపిస్తుంది.
వ్యాపారానికి, కుటుంబానికి, ధార్మిక కార్యక్రమాలకి ఆయన సమయాన్ని కేటాయించే తీరు, టైమ్ మేనేజ్‌మెంట్ : బిజినెస్ గురులకి అధ్యయనీయం.
భారతీయ భాషలన్నిటిలో సినిమాలు తీసిన ఆయనకి శత్రువులు లేకపోవడం. ఎన్టీఆర్ పట్ల, ఎన్టీఆర్ కుటుంబంపట్ల అత్యంత గౌరాభిమానాలు వున్న మహామనీషి ‘రామానాయుడు’ జీవితం బిజినెస్ స్కూలు విద్యార్ధులకి రీసెర్చి టాపిక్!!
-తోటకూర రఘు