Advertisement
Google Ads BL

కేజ్రీ రూపంలో ‘కసి’ తీర్చుకుంటున్న కాంగ్రెసు..!


దిల్లీలో ఒపీనియన్‌పోల్‌ , ‘ఆమ్‌ ఆద్మీ’ పార్టీకి అనుకకూలంగా కనిపిస్తోంది. తొలుత బిజెపి అనుకూల పవనాలు వీచాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆమ్‌ ఆద్మీ పుంజుకుంది. వాస్తవానికి ఇక్కడ ఆమ్‌ ఆద్మీ బలపడలేదు, బిజెపి బలహీనపడలేదు. దిల్లీలో సంప్రదాయ కాంగ్రెసు ఓటు బ్యాంకు వుంది. కాంగ్రెసుకి ప్రధమ శతృవు బిజెపి. కాంగ్రెసు ఎలాగూ గెలిచే స్థితిలో లేదు. కాంగ్రెసుకి ఈ స్థితిలో కావలసింది బిజెపి ఓటమి. ఈ దిశలో ఆలోచించిన కాంగ్రెసు ఓటర్లు ఆమ్‌ ఆద్మీ రూపంలో బిజెపివైపు స్వీట్‌ రీవెంజ్‌ తీసుకోవడానికి పావులు కదిపారు. బిజెపి రాజకీయ వ్యూహం 2014 , సార్వత్రిక ఎన్నికలముందు, తర్వాత చాలా తేడా కనిపిస్తోంది. బిజెపి మితిమీరిన విశ్వాసం మిత్రపక్షాలకు మింగుడు పడటంలేదు. కర్ణుడిచావుకి కారణాలు అనేకం అన్నట్టు దిల్లీలో ‘ఆమ్‌ ఆద్మీ’ ఒపీనియన్‌ పోల్‌లో ముందుండటానికి మమతా బెనర్జీ అనుచరగణం, జయలలిత సానుభూతిపరులు, వామపక్షాలు కూడా తమ పాత్రని పోషిస్తున్నారు.

Advertisement
CJ Advs

-తోటకూర రఘు

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs