సుదీర్ఘ సినిమా అనుభవం, ఇమేజ్ వున్న సీనియర్ తారల అవసరం జూనియర్స్‌కి చాలావుంది. ‘‘డైలాగ్స్ ` మాడ్యులేషన్ , యాక్షన్, రియాక్షన్’’ ఇంప్రొవైజ్ చేస్తారు. బ్రహ్మానందం, కోటా శ్రీనివాసరావు, దాసరి నిలబెట్టిన సినిమాలు ఎన్నో! ఈ కారణంచేతనే ఎస్వీఆర్, సావిత్రి , భానుమతిని ఇప్పుడుకూడా గుర్తుచేసుకుంటాం.
1983లో అట్లూరి పూర్ణచంద్రరావు, తాతినేని రామారావు అందించిన ‘అంధాకానూన్’కి తమిళ మాతృకకి అమితాబ్ కేరక్టరైజేషన్‌లో చాలా తేడావుంది. తమిళ మరియు తెలుగు వెర్షన్‌లో ఈ పాత్ర చాలా చిన్నది. కానీ అమితాబ్ కోసం ఈ కేరక్టర్‌ని పెంచారు. ఈ సినిమాతో రజనీకాంత్ హిందీ మార్కెట్ కొల్లగొట్టారు. తాజాగా రజనీకాంత్ అల్లుడు ధనుష్‌తో ఇద్దరి పేర్లూ కలిసివచ్చేలా ‘ధనుష్’లోని ష ` ‘అమితాబ్’లోని ‘మితాబ్’ ` కలిసి షమితాబ్ పేరిట ఓ విలక్షణమైన కథని తెరకెక్కించారు. వాస్తవానికి ధనుష్‌కి ఇది రెండవ హిందీ సినిమా. అంధాకానూన్ వలె ఈ షమితాబ్‌కూడా బాక్సాఫీసు విజయంతోపాటు ఫిలిమ్ క్రిటిక్స్ ప్రశంసలందుకున్నది.
ఇదే సమయంలో డా॥ రాజశేఖర్ ‘‘గడ్డం గ్యాంగ్’’ రూపంలో రీ`ఎంట్రీ ఇవ్వడం అభినందనీయం. ప్రేక్షకులలో ఓ గుర్తింపువున్న ఊర్వశి శారద , సూపర్‌స్టార్ కృష్ణ , విజయశాంతి తదితరులు ఔచిత్యమున్న పాత్రలలో కనిపించాలి. వారి అవసరం యువనటీ నటులకు, సినిమా పరిశ్రమకి చాలా వుంది. తమకి ఓ గుర్తింపు, గౌరవం, అవార్డులు రివార్డులు సంపాదించిపెట్టిన పరిశ్రమ రుణం తీర్చుకోవడానికి ఏకైక మార్గం : ఔచిత్యమున్న పాత్రలలో కనిపించడమే. అమితాబ్ ఈ విషయంలో అందరికీ ఆదర్శనీయుడు.
-తోటకూర రఘు