Advertisement
Google Ads BL

‘భక్త ప్రహ్లాద’ తర్వాత ‘దాగుడు మూత దండాకోర్‌’..!


‘‘భక్త ప్రహ్లాద`’’ ఎస్వీఆర్‌, రోజా రమణి, అంజలీదేవి: 1967లో వచ్చిన ఈ చిత్రంలో ఎస్వీఆర్‌కి ధీటుగా చిన్నారి రోజారమణి : ఎంత అద్భుతంగా నటించారో!

Advertisement
CJ Advs

మళ్ళీ ఇంతకాలానికి ఆ అపురూప దృశ్యం ఆవిష్కృతమవుతోంది. ‘దాగుడు మూత దండాకోర్‌’ చిత్రంలో ‘నట కిరీటి’ రాజేంద్ర ప్రసాద్‌కి ధీటుగా చిన్నారి సారా నటిస్తోంది.

‘గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్‌’ లాంటి చిత్రాల సృష్టికర్త క్రిష్‌ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉషాకిరణ్‌ మూవీస్‌ పతాకంపై రామోజీరావు నిర్మిస్తున్నారు.

‘‘ఆ నలుగురు’’ తర్వాత రాజేంద్ర ప్రసాద్‌కి నటుడుగా ఫుల్‌మీల్‌ ‘‘దాగుడు మూత దండాకోర్‌’’.

తెలుగు సినిమా ‘ఫ్యాక్షన్‌, పోలీసు యాక్షన్‌, టెర్రరిజమ్‌, క్యాంపస్‌ రొమాన్స్‌’ అనే చట్రంలో ఇరుక్కుపోయింది అంటున్నవారున్నారు. వారికి ‘ఆ నలుగురు, మిధునం, గమ్యం, వేదం’ లాంటి సినిమాలు గుర్తుకు రాక అలా అభిప్రాయపడివుండొచ్చు. గోర్కీ ‘‘అమ్మ’’ ` వయస్సు నాలుగు పదులపైనే వుంటుంది. ‘అమ్మ’ అంతర్జాతీయ సినిమా. శారద, లక్ష్మి, రాధిక, వాణిశ్రీ తదితర నటీమణులకు సరిపడా కథలు విశ్వసాహిత్యంలో ఎన్నెన్నో!

జీవిత చరమాంకానికి దగ్గరవుతున్న ఈ నటీమణులు జాతీయ, రాష్ట్ర అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు తెచ్చే ఈ తరహా ప్రయోగాలు బడ్జెట్‌లో చేయడానికి ముందుకు రావాలి. రామానాయుడు, రామోజీ రావు, దాసరి, నాగార్జున, దిల్‌రాజు, అల్లు అరవింద్‌ వంటి అభిరుచిగల నిర్మాతలు మనకు వున్నారు కొత్తదనాన్ని ప్రోత్సహించడానికి. ‘వేదం’ కథ నచ్చి అల్లు అర్జున్‌, మంచు మనోజ్‌ నటించారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.

-తోటకూర రఘు

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs